ఆత్మీయ పలకరింపులతో ముగిసిన చివరి కౌన్సిల్ సమావేశం
నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్ : మొన్నటి వరకు ఎన్నికల హడావిడితో ఒకరికొకరు కనిపించినా మాట్లాడని వారు, శనివారం నగరపాలక సంస్థ లో జరిగిన చివరి కౌన్సిల్ సమావేశంలో ఇరు పార్టీలకు చెందిన సభ్యులు ఒకరినొకరు ఆప్యాయంగా అనురాగాలతో పలకరించుకుంటూకనిపించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో నగరపాలక సంస్థ పాలకవర్గం చివరి సమావేశం మేయర్ దేవరకొండ సుజాత అధ్యక్షతన జరిగింది. నగర పాలక సంస్థ లోని కార్పొరేటర్లు ఒకే చోట చేరి, చివరి సమావేశానికి హాజరై ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ సందడి చేశారు. వైయస్సార్సీపికి చెందిన పలువురు కార్పొరేటర్లు టిడిపి కార్పొరేటర్లతో కలిసిన చివరి సమావేశం సరదాగా మారింది. ఈ సందర్భంగా పలువురు కార్పొరేటర్లు వారి అనుభూతులను సమావేశంలో వివరించారు. డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఏ సమస్య ఉన్న తమ దృష్టికి తెస్తే పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. కార్పొరేటర్ కర్తం ప్రతాపరెడ్డి మాట్లాడుతూ పార్టీలకతీతంగా స్నేహపూర్వకంగా ఉండాలని అన్నారు. కార్పొరేటర్ మూలే విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు రుణపడి ఉంటామన్నారు. మాకు కార్పొరేటర్ గా అవకాశం కల్పించారని అన్నారు. ప్రజల్లో ఉంటే మళ్లీ అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కార్పొరేటర్ గుంజి జయలక్ష్మి మాట్లాడుతూ వాలంటీర్ గా ఉన్న తనకు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కార్పొరేటర్ అవకాశం కల్పించారని, తాను తన డివిజన్ ను ఎంతో అభివృద్ధి చేశానని తెలిపారు. కార్పొరేటర్లు కర్ణం మంజుల, అరుణ, చెక్క అహల్య లు మాట్లాడుతూ తమ డివిజన్ లను ఎంతో అభివృద్ధి చేశామని తెలిపారు. కార్పొరేటర్ సత్తార్, పలువురు కార్పొరేటర్లు వారి వారి ఐదు సంవత్సరాల అభివృద్ధి, వారి అనుభూతులను తెలిపారు. మంత్రి నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నగర అభివృద్ధికి కృషి చేశారని మేయర్ దేవరకొండ సుజాత తో పాటు పలువురు కార్పొరేటర్లు తెలిపారు. కో ఆప్షన్ సభ్యులు నూనె మల్లికార్జున యాదవ్, వహీదా, జమీర్ తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కమిషనర్ నందన్, మేయర్ దేవరకొండ సుజాత, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులను ఘనంగా సన్మానించారు. కొత్త కార్పొరేటర్లు పాత కార్పొరేటర్ల కలయికతో చివరి సమావేశం ఆహ్లాదకరంగా కనిపించింది. నగరపాలక సంస్థలో జరిగిన చివరి కౌన్సిల్ సమావేశం కొద్దిసేపు డిప్యూటీ మేయర్ తహసిన్ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది. తరువాత మేయర్ దేవరకొండ సుజాత అధ్యక్షతన చివరి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.