BREAKING
సేవా దృక్పథం చాటుకున్న ఎస్ఎఫ్ఐ నాయకులు.. రాప్తాడు ఘటన బాధితురాలి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సహాయం ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థిగా ఉండాలి: డీఈఓ డాక్టర్ షేక్ సలీం భాష నూతన సర్పంచులకు అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ విధులు పై రివ్యూ మీటింగ్:" బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి కమలాకర్ రెడ్డి ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలి – బోరేగావ్ సర్పంచ్ నగేందర్ పాటిల్ పీహెచ్‌డీ వైవా విజయవంతంగా పూర్తి చేసిన తిరుమల రూపేష్ భక్తిపారవశ్యంలో కోటి దీపోత్సవం.. ఆధ్యాత్మిక శోభతో ఆలయ ప్రాంగణం మిలటరీ గ్రామం లోని జిల్లా పరిషత్ హై స్కూల్ నందు “సురక్షిత్ బచ్పన్ అభియాన్” పై అవగాహన సదస్సు" కూటమి బలపరిచిన కోవూరు సర్పంచి అభ్యర్థిగా వల్లెపు సునీల్ బాబు పంటపాలెం పారిశ్రామిక ప్రాంతంలో 132 కేవీ సబ్‌స్టేషన్ ఏర్పాటుకు ప్రతిపాదన చేయాలని ఎస్‌ఈని కోరిన పారిశ్రామిక వినియోగదారులు బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి కమలాకర్ రెడ్డి ఎన్నికల అధికారులకు శిక్షణ..! జన సందోహం మధ్య... సర్పంచ్ అభ్యర్థిగా ఆలపాక నామినేషన్ సౌత్ మోపూర్ సర్పంచ్ బరిలో బండి అంకమ్మ

మిలటరీ గ్రామం లోని జిల్లా పరిషత్ హై స్కూల్ నందు “సురక్షిత్ బచ్పన్ అభియాన్” పై అవగాహన సదస్సు"

Select Suryaa Now
మిలటరీ గ్రామం లోని జిల్లా పరిషత్ హై స్కూల్ నందు  “సురక్షిత్ బచ్పన్ అభియాన్” పై అవగాహన సదస్సు"

  

గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశానుసారంగా మరియు జిల్లా ప్రధాన న్యాయ మూర్తి శ్రీ పి. వాసు గారి ఆదేశాల మేరకు  శ్రీ మతి ఎం. సంధ్యా రాణి , ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి, కర్నూల్  వారు 
జాతీయ న్యాయ సేవాధికార సంస్థ (NALSA) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న “సురక్షిత్ బచ్పన్ అభియాన్” (Surakshit Bachpan Abhiyan) కార్యక్రమము లో భాగంగా మిలిటరీ కాలనీ నందుగల జిల్లా పరిషత్ హై స్కూల్ నందు  అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ బాలల హక్కులు, వ్యక్తిగత భద్రత, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (POCSO Act-2012), ఆన్‌లైన్ భద్రత, లైంగిక వేధింపులు జరిగినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు, ఫిర్యాదు చేసే విధానాలు, ఉచిత న్యాయ సహాయం తదితర అంశాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పిల్లలు తమకు ఎదురయ్యే సమస్యలను భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. బాలల భద్రత, హక్కుల పరిరక్షణపై విద్యార్థుల్లో చైతన్యం కల్పించడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.  పిల్లలకి ఎవరికైనా సమస్యలు వచ్చినప్పుడు లీగల్ సర్వీసెస్ టోల్ ఫ్రీ నెంబర్ 15100 కాల్ చేస్తే వారి సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్కూల్  ఇంచార్జి హెడ్ మాస్టర్ షఫీ ఉల్ల ,  ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.