ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థిగా ఉండాలి: డీఈఓ డాక్టర్ షేక్ సలీం భాష
గుంటూరు: మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయులు నూతన బోధనా పద్ధతులను అలవర్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ సలీం భాష పేర్కొన్నారు. శనివారం గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని ఎస్‌కేబీఎం ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల క్లస్టర్ సమావేశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ఉపాధ్యాయుడు ఎప్పటికీ నిరంతర విద్యార్థిగానే ఉండాలని సూచించారు. నూతన పాఠ్యాంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకుని విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించా లన్నారు. విద్యా రంగంలో వస్తున్న నూతన ఒరవడులను నేర్చుకోవడానికి ఇలాంటి క్లస్టర్ సమావేశాలు ఎంతగానో దోహదపడతాయని, ఉపాధ్యాయులందరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.అనంతరం పాఠశాలలోని తరగతి గదులను సందర్శించి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. అలాగే, ఉపాధ్యాయులందరూ ఎస్‌ఏ-1 పరీక్షల మార్కులను ఎటువంటి జాప్యం లేకుండా వెంటనే 'లీప్' యాప్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు
సూర్య నాయక్