ఉసిరికాయఅలంకరణ లో స్వ యంభూ శ్రీలక్ష్మీనరసింహ స్వామీ
బద్వేల్ మేజర్ న్యూస్
కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం వల్లేరవారి పల్లె గ్రామం లో వెలసినస్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామికి కార్తీక మాసం రెండవ శనివారం ప్రత్యేక పూజభిషేకాలను హోమం అంగరం గ వైభవంగా నిర్వహించారు, ఉసిరికాయ అలంకరణ స్వామి అమ్మ వారికి ప్రత్యేక అలంకరణలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామిని భక్తులు కన్నుల పండుగ దర్శించుకున్నారు, భక్తులు దర్శించుకున్న అనంతరం ఆనందం వ్యక్తం చేశారు, ప్రతివారం నిర్వహించే ఈ పవిత్రమైన పూజోత్సవాలను అలంకరణ లను దర్శించుకోవడం వల్ల మెరుగైన జీవన వ్యవస్థ ఏర్పడుతుందని హాజరైన ప్రజలు పేర్కొన్నారు, తదుపరి స్వామి వారికి బద్వేల్ పట్టణముకు చెందిన బచ్చల భాగ్యమ్మ గారి కుటుంబ సభ్యులు 11 తులాల వెండి గొడుగును స్వామి వారికి బహుకరించడం జరిగినది,వీడి యో కాల్ ద్వారా దేశ విదేశాలలో ఉన్న నరసింహస్వామి భక్తులు కార్యక్రమాన్ని తిలకించి ఆనం దించారు, అన తరం స్వామి వారిని దర్శించుకున్న భక్తులకు అన్నప్రసాద వితరణ గావించారు.
రిపోర్టర్.. సి.రవికుమార్ బద్వేల్ నియోజకవర్గం.కడప జిల్లా.