BREAKING
ఎన్ని పొర్లు దండాలు పెట్టిన, కుప్పిగెంతులు వేసిన అధికారంలోకి రావడం జగన్మోహన్ రెడ్డికి పగటి కలే ఎమ్మెల్సీ వర్ల రామయ్య ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండండి... ప్రతి ఓటర్ ను కలవండి. ఎమ్మెల్యే శాస్త్రృక్తంగా తులసీ దామోదర, గో వృషభ కళ్యాణాలు చరిత్రలో నిలిచిపోయేలా నితిన్ నబీన్ ‘మహా పాదయాత్ర’’కు ఏర్పాట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ పెంచలకోనలో వైభవంగా చిలుక ద్వాదశి ఉత్సవాలు తల్పగిరి రంగనాధ స్వామి ఆలయంలో వైభవంగా చిలుక ద్వాదశి వేడుక సోమవారం జీఎంసీ 'పీజీఆర్ఎస్' రద్దు: కమిషనర్ కె. మయూర్ అశోక్ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు మంచం.. కత్తెర .. ఉంగరం.. బుట్ట.. వంకాయ! నలుగురు నిందితుల అరెస్ట్… కారంచేడు అరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వీడి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయండి వందవాగలి గ్రామ సర్పంచ్ గా సత్యనారాయణ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక నేటి నుండి ​ఐదు జిల్లాల పాత కేసుల విచారణ ​క్యాంప్ కోర్టు నోడల్ అధికారి బొగ్గరం తారక నరసింహ కుమార్ వెల్లడి పామూరు అభివృద్ధికి ఒక్క అవకాశం ఇవ్వండి

నలుగురు నిందితుల అరెస్ట్…

Select Suryaa Now
నలుగురు నిందితుల అరెస్ట్…

గుంటూరు :  గుంటూరు నగరంలోని పలకలూరు రోడ్డులో జరిగిన దొడ్డ నాగరాజు హత్య కేసును పట్టాభిపురం పోలీసులు ఛేదించారు. కేవలం రూ.10 వేల ఆర్థిక లావాదేవీల వివాదమే హత్యకు కారణమని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఘటనకు సంబంధించి నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు శనివారం  వెస్ట్ డీఎస్పీ బెల్లం శ్రీనివాసరావు పట్టాభిపురం ఎస్ ఐ గంగా వెంకటేశ్వర్లు తో కలసి కేసు వివరాలను వెల్లడించారు. గుంటూరులోని పలకలూరు రోడ్డులో ఉన్న స్వగృహ హైట్స్ అపార్ట్‌మెంట్స్‌లో నివాసం ఉంటున్న దొడ్డ నాగరాజు అదృశ్యమైనట్లు అతని తండ్రి దొడ్డ నతానియేల్ అక్టోబర్ 20న పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అక్టోబర్ 22న ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్-3, విజ్ఞాన్ కళాశాల వెనుక ప్రాంతంలో నాగరాజు మృతదేహం లభ్యమైంది. దీంతో కేసును అనుమానాస్పద మృతిగా పరిగణించి సెక్షన్ 194 బీన్ ఎస్ ఎస్ కింద దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలంలో మృతుడి మోటార్ సైకిల్, మొబైల్ ఫోన్ కనిపించకపోవడంతో పోలీసులు ఆ దిశగా విచారణ ముమ్మరం చేశారు. గుంటూరు వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ బెల్లం శ్రీనివాసరావు పర్యవేక్షణలో పట్టాభిపురం పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ గంగా వెంకటేశ్వర్లు సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు కొనసాగించారు.
ఈ క్రమంలో నడ్డి దుర్గా యశ్వంత్, నడ్డి మల్లు అలియాస్ మనోజ్, నంబూరు అశోక్, దాసరి సుభాష్ అనే నలుగురు నిందితులు పోలీసులకు పట్టుబడతామనే భయంతో ఈ నెల 20వ తేదీన వార్డు రెవెన్యూ సెక్రటరీ ఎదుట లొంగిపోయారు. అనంతరం వారిని పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో హాజరుపరిచారు.
రూ.10 వేలే వివాదానికి కారణం…!
మృతుడు నాగరాజుకు నడ్డి దుర్గా యశ్వంత్ గతంలో రూ.10 వేలు చెల్లించాల్సి ఉంది. ఈ డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. అక్టోబర్ 20న నాగరాజుతో పాటు నడ్డి మల్లు అలియాస్ మనోజ్, నంబూరు అశోక్, దాసరి సుభాష్ మద్యం సేవించేందుకు అడవితక్కెళ్లపాడులోని టిడ్కో ఇళ్ల వద్ద కలుసుకున్నారు. అనంతరం స్వర్ణభారతి నగర్‌కు వెళ్లారు.అక్కడ తనకు రావాల్సిన డబ్బుల గురించి నాగరాజు యశ్వంత్‌ను ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో యశ్వంత్ సూచన మేరకు మిగిలిన ముగ్గురు నాగరాజును ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్-3 ప్రాంతానికి తీసుకెళ్లి బీరు సీసాలతో దాడి చేసినట్లు నిందితుల వాంగ్మూలాల్లో వెల్లడైందని పోలీసులు తెలిపారు. ఈ దాడిలో నాగరాజు మృతి చెందినట్లు పేర్కొన్నారు.

మోటార్ సైకిల్, మొబైల్ ఫోన్లు స్వాధీనం…
నలుగురు నిందితులను నవంబర్ 20న రాత్రి 9 గంటలకు పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద  మృతుడికి చెందిన హోండా యూనికార్న్ మోటార్ సైకిల్ , మొబైల్ ఫోన్‌తో పాటు నిందితులకు చెందిన మరో రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచగా గౌరవ మేజిస్ట్రేట్ 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు వెస్ట్ డీఎస్పీ బెల్లం శ్రీనివాసరావు తెలిపారు.

 

 

 కే నాగరాజు గుంటూరు క్రైమ్