BREAKING
ఎన్ని పొర్లు దండాలు పెట్టిన, కుప్పిగెంతులు వేసిన అధికారంలోకి రావడం జగన్మోహన్ రెడ్డికి పగటి కలే ఎమ్మెల్సీ వర్ల రామయ్య ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండండి... ప్రతి ఓటర్ ను కలవండి. ఎమ్మెల్యే శాస్త్రృక్తంగా తులసీ దామోదర, గో వృషభ కళ్యాణాలు చరిత్రలో నిలిచిపోయేలా నితిన్ నబీన్ ‘మహా పాదయాత్ర’’కు ఏర్పాట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ పెంచలకోనలో వైభవంగా చిలుక ద్వాదశి ఉత్సవాలు తల్పగిరి రంగనాధ స్వామి ఆలయంలో వైభవంగా చిలుక ద్వాదశి వేడుక సోమవారం జీఎంసీ 'పీజీఆర్ఎస్' రద్దు: కమిషనర్ కె. మయూర్ అశోక్ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు మంచం.. కత్తెర .. ఉంగరం.. బుట్ట.. వంకాయ! నలుగురు నిందితుల అరెస్ట్… కారంచేడు అరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వీడి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయండి వందవాగలి గ్రామ సర్పంచ్ గా సత్యనారాయణ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక నేటి నుండి ​ఐదు జిల్లాల పాత కేసుల విచారణ ​క్యాంప్ కోర్టు నోడల్ అధికారి బొగ్గరం తారక నరసింహ కుమార్ వెల్లడి పామూరు అభివృద్ధికి ఒక్క అవకాశం ఇవ్వండి

పామూరు అభివృద్ధికి ఒక్క అవకాశం ఇవ్వండి

Select Suryaa Now
పామూరు అభివృద్ధికి ఒక్క అవకాశం ఇవ్వండి

- ప్రతి వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం - షంఘార్

పామూరు, మేజర్ న్యూస్ : పామూరు పట్టణ అభివృద్ధికి సరికొత్త దిశానిర్దేశం చేస్తానని ప్రజలు తనపై నమ్మకంతో ఒక్క అవకాశం కల్పిస్తే పట్టణ రూపురేఖలు మార్చేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తానని ఎన్డీఏ కూటమి సర్పంచ్ అభ్యర్థి షేక్ షంషూర్ స్పష్టం చేశారు. కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆశీస్సులతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆయన శనివారం పట్టణంలోని పలు వార్డుల్లో విస్తృతంగా పర్యటించి ఓటర్లను కలుసుకున్నారు. ఈ సందర్భంగా పట్టణ అభివృద్ధిపై తనకున్న ఆలోచనలను ప్రజల ముందుంచుతూ ప్రతి వార్డును సమానంగా అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించేందుకు అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. పదవిని అధికారంగా కాకుండా ప్రజలకు సేవ చేసే బాధ్యతగా భావిస్తానని కులమతాలు, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటూ పామూరు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. తనపై విశ్వాసం ఉంచి గెలిపించాలని ప్రజలు కల్పించే అవకాశాన్ని పట్టణ అభివృద్ధికి అంకితం చేస్తానని షంషూర్ ఓటర్లను అభ్యర్థించారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి నేతలు పాల్గొన్నారు.