BREAKING
ఎన్ని పొర్లు దండాలు పెట్టిన, కుప్పిగెంతులు వేసిన అధికారంలోకి రావడం జగన్మోహన్ రెడ్డికి పగటి కలే ఎమ్మెల్సీ వర్ల రామయ్య ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండండి... ప్రతి ఓటర్ ను కలవండి. ఎమ్మెల్యే శాస్త్రృక్తంగా తులసీ దామోదర, గో వృషభ కళ్యాణాలు చరిత్రలో నిలిచిపోయేలా నితిన్ నబీన్ ‘మహా పాదయాత్ర’’కు ఏర్పాట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ పెంచలకోనలో వైభవంగా చిలుక ద్వాదశి ఉత్సవాలు తల్పగిరి రంగనాధ స్వామి ఆలయంలో వైభవంగా చిలుక ద్వాదశి వేడుక సోమవారం జీఎంసీ 'పీజీఆర్ఎస్' రద్దు: కమిషనర్ కె. మయూర్ అశోక్ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు మంచం.. కత్తెర .. ఉంగరం.. బుట్ట.. వంకాయ! నలుగురు నిందితుల అరెస్ట్… కారంచేడు అరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వీడి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయండి వందవాగలి గ్రామ సర్పంచ్ గా సత్యనారాయణ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక నేటి నుండి ​ఐదు జిల్లాల పాత కేసుల విచారణ ​క్యాంప్ కోర్టు నోడల్ అధికారి బొగ్గరం తారక నరసింహ కుమార్ వెల్లడి పామూరు అభివృద్ధికి ఒక్క అవకాశం ఇవ్వండి

తల్పగిరి రంగనాధ స్వామి ఆలయంలో వైభవంగా చిలుక ద్వాదశి వేడుక

Select Suryaa Now
తల్పగిరి రంగనాధ స్వామి ఆలయంలో వైభవంగా చిలుక ద్వాదశి వేడుక

నెల్లూరు కల్చరల్ మేజర్ న్యూస్ 

నెల్లూరు రంగనాయకులపేటలోని శ్రీ తల్పగిరి రంగనాధ స్వామి దేవస్థానంలో శనివారం చిలుక ద్వాదశి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఉదయం  శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ రంగనాధ స్వామికి శాస్త్రోక్తంగా తిరుమంజనం జరిపారు.

సాయంత్రం శ్రీ రంగనాధ స్వామి వారు బంగారు గరుడసేవపై పేట ఉత్సవంలో భాగంగా ఉత్తరాధి మఠం (శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం) వద్దకు వేంచేశారు. అక్కడ శ్రీ రంగనాధ స్వామికి, శ్రీ తులసి అమ్మవారికి అర్చకులు వేదమంత్రోచ్ఛరణల మధ్య తులసి కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. కల్యాణోత్సవం అనంతరం శ్రీ రంగనాధ స్వామి వారి పేట ఉత్సవం భక్తిశ్రద్ధలతో సాగింది. ఈ వేడుకలకు కీ.శే. వేముగుంట రాఘవేంద్ర రావు కుమారులు ఉభయకర్తలుగా వ్యవహరించారు.

ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఆళ్ళ శ్రీనివాస రెడ్డి, దేవస్థాన చైర్మన్ లెక్కల వెంకట రెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు, ఎక్స్-అఫీషియో మెంబర్ ఈ. దొరస్వామితో పాటు దేవస్థానం అర్చకులు, సిబ్బంది, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.