BREAKING
ఎన్ని పొర్లు దండాలు పెట్టిన, కుప్పిగెంతులు వేసిన అధికారంలోకి రావడం జగన్మోహన్ రెడ్డికి పగటి కలే ఎమ్మెల్సీ వర్ల రామయ్య ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండండి... ప్రతి ఓటర్ ను కలవండి. ఎమ్మెల్యే శాస్త్రృక్తంగా తులసీ దామోదర, గో వృషభ కళ్యాణాలు చరిత్రలో నిలిచిపోయేలా నితిన్ నబీన్ ‘మహా పాదయాత్ర’’కు ఏర్పాట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ పెంచలకోనలో వైభవంగా చిలుక ద్వాదశి ఉత్సవాలు తల్పగిరి రంగనాధ స్వామి ఆలయంలో వైభవంగా చిలుక ద్వాదశి వేడుక సోమవారం జీఎంసీ 'పీజీఆర్ఎస్' రద్దు: కమిషనర్ కె. మయూర్ అశోక్ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు మంచం.. కత్తెర .. ఉంగరం.. బుట్ట.. వంకాయ! నలుగురు నిందితుల అరెస్ట్… కారంచేడు అరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వీడి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయండి వందవాగలి గ్రామ సర్పంచ్ గా సత్యనారాయణ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక నేటి నుండి ​ఐదు జిల్లాల పాత కేసుల విచారణ ​క్యాంప్ కోర్టు నోడల్ అధికారి బొగ్గరం తారక నరసింహ కుమార్ వెల్లడి పామూరు అభివృద్ధికి ఒక్క అవకాశం ఇవ్వండి

అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వీడి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయండి

Select Suryaa Now
అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వీడి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయండి

 గుంటూరు : గుంటూరు నగరంలో చేపడుతున్న ప్రాజెక్ట్ పనులను నిర్దేశిత సమయంలోపు పూర్తి చేయాలని నగర కమిషనర్ కే. మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. శనివారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్సు హాల్ నందు శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణం, ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్3, మిర్చి యార్డ్ దగ్గర ఫ్లైఓవర్ నిర్మాణం, అమృత్ 2.0 క్రింద గుంటూరు రూరల్ ప్రాంతాల్లో ఈఎల్ఎస్ఆర్ ల నిర్మాణం, బిఆర్ స్టేడియం మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మాణం, నందివెలుగు రోడ్డు ఆర్ ఓ బి నిర్మాణ అభివృద్ధి పనులపై ఆయా విభాగాల అధికారులు, జిఎంసి అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రస్తుతం నగరంలో చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లు గుంటూరు నగరానికి తలమానికంగా నిలుస్తాయని, అందుకు తగిన విధంగా నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూనే, సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో కృషి చేయాలని ప్రతి పనికి తగిన కాలపరిమితి విధించుకొని పనులు పూర్తి చేయాలన్నారు. శంకర్ విలాస్ వంతెన పనులు త్వరితగతిన చేయుటకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు, సైడ్ డ్రెయిన్ నిర్మాణ పనులు, సర్వీసు రోడ్డు నిర్మించుటకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్3 నిర్మాణ పనులు జనవరి చివరినాటికి పూర్తయ్యేలా ప్రణాలికలు సిద్దం చేసుకోవాలని, పోల్స్ షిఫ్టింగ్, సెంటర్ డివైడర్, గ్రీనరి అభివృద్ధి పనులు చేయాలన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు ఫేజ్ 3 లో పలకలూరు నుండి అంతర్గత రోడ్ల అభివృద్దికి చర్యలు తీసుకోవాలన్నారు. అమృత్ 2.0 పధకం క్రింద రూరల్ ప్రాంతాలలో మంజూరు అయిన ఈఎల్ఎస్ఆర్ ల నిర్మాణ పనుల పురోగతి వివరాలు అడిగి తెలుసుకొని, పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, ఈఎల్ఎస్ఆర్ ల నుండి డిస్ట్రిబ్యూషన్ లైన్లు, ప్రధాన పైప్ లైన్ పనులకు సంబంధించిన మ్యాప్ లను అందజేయాలన్నారు. యాదవ డొంక అభివృద్ధి చేయడానికి ఆర్ డి పి తయారు చేయాలని, అలాగే పోలిశెట్టి కుంట నుండి జొన్నలగడ్డ రోడ్డు అభివృద్ధి చేయడానికి ఆర్ డి పి సిద్దం చేయాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. మిర్చి యార్డ్ దగ్గర ఫ్లై ఓవర్ పనులను డిసెంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బిఆర్ స్టేడియం అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా బి ఆర్ స్టేడియం నందు అభివృద్ధి చేస్తున్న వివిధ కోర్ట్ లు, ప్లే గ్రౌండ్స్, జిమ్, బాక్సింగ్ వంటి వాటిని ఆదిని హంగులతో అభివృద్ధి చేయాలని ఆదేశించారు. సదరు పనులు ఫెబ్రవరి నాటికి పూర్తి చేయాలని, సదరు పనులు వేగవంతానికి నగర పాలక సంస్థ నుండి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. పనులు త్వరితగతిన పూర్తి చేయడానికి అధికారులు అందరు సమన్వయంతో పని చేయాలన్నారు. నందివెలుగు రోడ్డు ఆర్ ఓ బి పనులలో భాగంగా ఆర్ బి అధికారులతో జియంసి పట్టణ ప్రణాళిక అధికారులు సమన్వయం చేసుకొని పనులు త్వరితగతి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.   సమావేశాల్లో ఆర్ డి ఓ శ్రీనివాస రావు, సిటీ ప్లానర్ రాంబాబు, జియంసి యస్ఈ జి.వెంకటేశ్వర రావు, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ అధికారులు, డిఎస్డీఓ, ఆర్&బి ఇంజనీరింగ్ అధికారులు, జిఎంసి ఈఈలు, రైల్వే అధికారులు, ఎన్హెచ్ఐ ఏఈ ఆయా ప్రాజెక్ట్స్ కాంట్రాక్టర్ ప్రతినిధులు పాల్గొన్నారు.

 

సూర్య నాయక్