BREAKING
ఎన్ని పొర్లు దండాలు పెట్టిన, కుప్పిగెంతులు వేసిన అధికారంలోకి రావడం జగన్మోహన్ రెడ్డికి పగటి కలే ఎమ్మెల్సీ వర్ల రామయ్య ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండండి... ప్రతి ఓటర్ ను కలవండి. ఎమ్మెల్యే శాస్త్రృక్తంగా తులసీ దామోదర, గో వృషభ కళ్యాణాలు చరిత్రలో నిలిచిపోయేలా నితిన్ నబీన్ ‘మహా పాదయాత్ర’’కు ఏర్పాట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ పెంచలకోనలో వైభవంగా చిలుక ద్వాదశి ఉత్సవాలు తల్పగిరి రంగనాధ స్వామి ఆలయంలో వైభవంగా చిలుక ద్వాదశి వేడుక సోమవారం జీఎంసీ 'పీజీఆర్ఎస్' రద్దు: కమిషనర్ కె. మయూర్ అశోక్ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు మంచం.. కత్తెర .. ఉంగరం.. బుట్ట.. వంకాయ! నలుగురు నిందితుల అరెస్ట్… కారంచేడు అరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వీడి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయండి వందవాగలి గ్రామ సర్పంచ్ గా సత్యనారాయణ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక నేటి నుండి ​ఐదు జిల్లాల పాత కేసుల విచారణ ​క్యాంప్ కోర్టు నోడల్ అధికారి బొగ్గరం తారక నరసింహ కుమార్ వెల్లడి పామూరు అభివృద్ధికి ఒక్క అవకాశం ఇవ్వండి

కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు

Select Suryaa Now
కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు

తెలంగాణ బ్యూరో, ప్రతినిధి: కేసీఆర్‌ హయాంలో అభివృద్ధి బాటలో సాగిన తెలంగాణ గ్రామాలు, ప్రస్తుత కాంగ్రెస్‌ పాలనలో నిధుల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీల ఖర్చులు భారీగా తగ్గిపోయాయని పేర్కొంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన ‘ఫైనాన్సెస్ ఆఫ్ పంచాయతీరాజ్ ఇన్‌స్టిట్యూషన్స్’ నివేదికను ప్రస్తావిస్తూ కేటీఆర్ ఈ వివరాలను వెల్లడించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలోని గ్రామ పంచాయతీలు సగటున ఒక్కొక్కటి రూ.16.59 లక్షలు ఖర్చు చేయగా, ప్రస్తుత కాంగ్రెస్‌ పాలనలో 2024-25 నాటికి ఆ మొత్తం రూ.6.24 లక్షలకు పడిపోయిందని ఆయన తెలిపారు.
ప్రజలు కట్టిన పన్నులు, ప్రభుత్వం తెస్తున్న అప్పులు అభివృద్ధి పనులకు చేరడం లేదని ఆరోపించారు. రేవంత్‌ రెడ్డి పాలనలో పల్లె నుంచి పట్నం వరకు ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదని, జరుగుతున్నదంతా విధ్వంసమేనని కేటీఆర్ పేర్కొన్నారు.