అమ్మ చేతి వంటతో ఆరోగ్యం.. బయటి ఆహారంతో అనారోగ్యం బయటి ఆహారానికి నో చెబుదాం.. ఇంటి భోజనంతో ఆరోగ్యాన్ని కాపాడుకుందాం..
అమీన్ పూర్ ; సమాజాన్ని నిశ్శబ్దంగా కబళిస్తున్న ఆరోగ్య ముప్పుపై సాయి హై స్కూల్ విద్యార్థులు కదం తొక్కారు.
అమీన్పూర్ జిహెచ్ఎంసి పరిధిలోని బీరంగూడ సాయి హై స్కూల్ విద్యార్థులు జంక్ ఫుడ్ అనే విషపూరిత అలవాట్లకు, పరిసరాల అపరిశుభ్రత అనే ప్రమాదకర శత్రువుకు చెక్ పెట్టేందుకు విద్యార్థులు రంగంలోకి దిగారు. శనివారం ఉదయం బీరంగూడ వీధుల్లో న్యూట్రిషన్ అవేర్నెస్ ర్యాలీ పేరుతో భారీ చైతన్య యాత్రను నిర్వహించారు. వీధుల్లో మార్మోగిన ఆరోగ్య నినాదాలు, ఆరోగ్యకరమైన పిల్లలు ఆరోగ్యకరమైన సమాజం ఆరోగ్యకరమైన తెలంగాణ అనే నినాదంతో విద్యార్థులు ప్లకార్డులు చేత బూని కవాతు నిర్వహించారు.
లక్ష్మీ సాయి మెడోస్ జయలక్ష్మి నగర్ సాయి నగర్ కాలనీల గుండా సాగిన ఈ ర్యాలీలో స్థానికులను ఉద్దేశించి విద్యార్థులు ఘాటైన సందేశాలను వినిపించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రమేష్ బాబు మాట్లాడుతూ.. నేటి తరం బలంగా ఉంటేనే రేపటి భవిష్యత్తుకు సురక్షితంగా ఉంటుందని అందుకు సమతుల్య ఆహారమే అసలైన ఆయుధమని ఆయన స్పష్టం చేశారు. అనారోగ్యాన్ని తెచ్చిపెట్టే ఆహారానికి దూరంగా ఉంటూ, బలాన్ని ఇచ్చే పౌష్టికాహారాన్ని తీసుకోవాలని ఆయన తెలిపారు. పరిసరాల పరిశుభ్రత సంపూర్ణ ఆరోగ్య రక్ష అని అన్నారు. ఆహారం ఏ కాదు మన చుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉన్నప్పుడే రోగాల బారి నుండి తప్పించుకోగలమని స్థానికులకు ఇషా నిర్దేశం చేశారు.
చిన్న వయసులోని సమాజ శ్రేయస్సుకోసం విద్యార్థులు చేపట్టిన ఈ అవగాహన ర్యాలీ కాలనీవాసులను విశేషంగా ఆకట్టుకుందని ఆయన అన్నారు.