BREAKING
పంటపాలెం పారిశ్రామిక ప్రాంతంలో 132 కేవీ సబ్‌స్టేషన్ ఏర్పాటుకు ప్రతిపాదన చేయాలని ఎస్‌ఈని కోరిన పారిశ్రామిక వినియోగదారులు బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి కమలాకర్ రెడ్డి ఎన్నికల అధికారులకు శిక్షణ..! జన సందోహం మధ్య... సర్పంచ్ అభ్యర్థిగా ఆలపాక నామినేషన్ సౌత్ మోపూర్ సర్పంచ్ బరిలో బండి అంకమ్మ ఆత్మకూరు మండలంలో ఏకగ్రీవం కానున్న పలు పంచాయతీలు విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి ప్రజారోగ్యమే ప్రథమ ప్రాధాన్యత.. మంచినీటి ట్యాంక్ డీప్ క్లీనింగ్‌కు కార్పొరేటర్ విజయలక్ష్మి చర్యలు! ఆత్మీయ పలకరింపులతో ముగిసిన చివరి కౌన్సిల్ సమావేశం సర్పంచ్ అభ్యర్థిగా పొట్నూరు వాణి సాయి ప్రసాద్ నామినేషన్ అమ్మ చేతి వంటతో ఆరోగ్యం.. బయటి ఆహారంతో అనారోగ్యం బయటి ఆహారానికి నో చెబుదాం.. ఇంటి భోజనంతో ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.. ఎన్నికల సిబ్బందికి శిక్షణా తరగతులు పాత వెల్లంటిలో సీపీఎం సర్పంచ్ అభ్యర్థిగా పల్లవరపు చెంచయ్య నామినేషన్ వినబడని ప్రజల దాహం కేకలు...! స్పెషల్ లోక్ అదాలత్"

అక్రమ ఇసుక తవ్వకాలపై అటవీ శాఖ చర్యలు రెండు ఇమ్మర్షన్ మోటార్లు స్వాధీనం

Select Suryaa Now
అక్రమ ఇసుక తవ్వకాలపై అటవీ శాఖ చర్యలు  రెండు ఇమ్మర్షన్ మోటార్లు స్వాధీనం

సంగారెడ్డి  ప్రతినిధి ; రిజర్వ్ అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉన్న వాగుల్లో అక్రమ ఇసుక తవ్వకాలు, ఇసుక వడపోతకు ఉపయోగిస్తున్న రెండు ఇమ్మర్షన్ మోటార్లను అటవీ శాఖ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. జిల్లా అటవీ అధికారి జోజి ఆదేశాల మేరకు మెదక్ రేంజ్ పరిధిలోని పాథూర్ సెక్షన్, ఔసలాపల్లి బీట్, కంపార్ట్‌మెంట్ నంబర్ 137లో ఈ చర్యలు చేపట్టారు.అటవీ ప్రాంతానికి సమీపంలోని వాగుల్లో అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపడుతూ, ఇసుక వడపోత కోసం మోటార్లను వినియోగిస్తున్నట్లు గుర్తించిన అటవీ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. సహజ వనరులకు నష్టం కలిగించే ఇటువంటి చర్యలను అరికట్టేందుకు అటవీ శాఖ నిఘా పెంచింది.ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్తులో నీటి కొరత ఏర్పడే అవకాశాల నేపథ్యంలో సహజ నీటి వనరులను సంరక్షించుకోవడం అత్యంత అవసరమని అధికారులు పేర్కొన్నారు. వాగులు, ఇతర సహజ నీటి వనరుల్లో అక్రమ ఇసుక తవ్వకాలు, ఇసుక వడపోత పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు.ఇకపై ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా అటవీ అధికారి హెచ్చరించారు. ప్రజలు నీటి వనరులు, పర్యావరణ పరిరక్షణలో అటవీ శాఖకు సహకరించాలని కోరారు.