BREAKING
పంటపాలెం పారిశ్రామిక ప్రాంతంలో 132 కేవీ సబ్‌స్టేషన్ ఏర్పాటుకు ప్రతిపాదన చేయాలని ఎస్‌ఈని కోరిన పారిశ్రామిక వినియోగదారులు బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి కమలాకర్ రెడ్డి ఎన్నికల అధికారులకు శిక్షణ..! జన సందోహం మధ్య... సర్పంచ్ అభ్యర్థిగా ఆలపాక నామినేషన్ సౌత్ మోపూర్ సర్పంచ్ బరిలో బండి అంకమ్మ ఆత్మకూరు మండలంలో ఏకగ్రీవం కానున్న పలు పంచాయతీలు విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి ప్రజారోగ్యమే ప్రథమ ప్రాధాన్యత.. మంచినీటి ట్యాంక్ డీప్ క్లీనింగ్‌కు కార్పొరేటర్ విజయలక్ష్మి చర్యలు! ఆత్మీయ పలకరింపులతో ముగిసిన చివరి కౌన్సిల్ సమావేశం సర్పంచ్ అభ్యర్థిగా పొట్నూరు వాణి సాయి ప్రసాద్ నామినేషన్ అమ్మ చేతి వంటతో ఆరోగ్యం.. బయటి ఆహారంతో అనారోగ్యం బయటి ఆహారానికి నో చెబుదాం.. ఇంటి భోజనంతో ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.. ఎన్నికల సిబ్బందికి శిక్షణా తరగతులు పాత వెల్లంటిలో సీపీఎం సర్పంచ్ అభ్యర్థిగా పల్లవరపు చెంచయ్య నామినేషన్ వినబడని ప్రజల దాహం కేకలు...! స్పెషల్ లోక్ అదాలత్"

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి.....

Select Suryaa Now
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి.....

దుబ్బాక ; చేపల వేటకు వెళ్లిన వ్యక్తి కాలువలో ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందిన ఘటన దుబ్బాక పట్టణంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. దుబ్బాక ఎస్సై కీర్తి రాజు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణానికి చెందిన పెంటమ్ కృష్ణ (40) చేపలు పట్టే వృత్తిని నిర్వహిస్తూ, భార్య ప్రియాంక, ముగ్గురు కుమార్తెలతో జీవనం కొనసాగిస్తున్నాడు. రోజు మాదిరిగానే పట్టణంలోని పెద్ద చెరువు కాలువ వద్దకు చేపల వేటకు వెళ్లాడు. కాలువ వద్ద ప్రమాదవశాత్తు జారి మృతి చెందాడు. చేపల వేటకు వెళ్లిన భర్త ఇంటికి తిరిగి రాకపోయేసరికి, భార్య కుటుంబ సభ్యులతో కలిసి పెద్దచెరువు వద్ద పరిశీలిస్తుండగా, సమీపంలోని కాలువలో కృష్ణ మృతదేహాన్ని గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని, పంచనామా నిర్వహించి, మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం దుబ్బాక వంద పడకల ప్రాంతియ ఆసుపత్రికి తరలించారు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.