BREAKING
వినబడని ప్రజల దాహం కేకలు...! స్పెషల్ లోక్ అదాలత్" చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి..... ఎన్నికల సిబ్బందికి శిక్షణా తరగతులు ఆంగ్ల భాషా నైపుణ్యం పై విద్యార్థులకు ప్రతిభా పోటీలు.. ఘనంగా ముగిసిన బాలలహక్కుల పరిరక్షణ వారోత్సవాలు : ఫోర్డ్ సంస్థ డైరెక్టర్ జల్లా లలితమ్మ వెల్లడి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా పనిచేయాలి -వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లకు మేకపాటి విక్రమ్‌రెడ్డి పిలుపు తామరపల్లి మహిళా కళాశాల విద్యార్థుల స్వచ్ఛంద శ్రమదానం.. మున్సిపాలిటీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం: మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి అక్రమ ఇసుక తవ్వకాలపై అటవీ శాఖ చర్యలు రెండు ఇమ్మర్షన్ మోటార్లు స్వాధీనం మదనపల్లిలో కూటమి సర్పంచ్ అభ్యర్థుల జాబితా విడుదల : కూటమి అభ్యర్థులు గెలుపు కోసం సమిష్టిగా పనిచేయాలి : మదనపల్లి ఎమ్మెల్యే షాజహన్ బాషా ఆదేశం సిరిసిల్ల నుంచి పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సు 40వ వార్డులో జోరందుకున్న ఎన్నికల ప్రచారం సైదాపురం సర్పంచ్ అభ్యర్థిగా బోల్లిగర్ల అర్చన నామినేషన్ దాఖలు మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

మహిళలు స్వయం శక్తితో ఎదగడమే మెదక్ మిల్లీ అసోసియేషన్ లక్ష్యం కుట్టు శిక్షణ పూర్తి చేసిన 44 మంది మహిళలకు సర్టిఫికెట్ల పంపిణీ

Select Suryaa Now
మహిళలు స్వయం శక్తితో ఎదగడమే మెదక్ మిల్లీ అసోసియేషన్ లక్ష్యం  కుట్టు శిక్షణ పూర్తి చేసిన 44 మంది మహిళలకు సర్టిఫికెట్ల పంపిణీ

కొల్చారం …మహిళలు తమ కాళ్లపై తాము నిలబడి స్వయం శక్తితో ఎదగాలన్నదే మెదక్ మిల్లీ అసోసియేషన్ ప్రధాన లక్ష్యమని అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఉమర్ ఖాన్, జనరల్ సెక్రటరీ సోఫీ సుజాత్ అలీ, సభ్యులు రియాజ్ అన్నారు.
శనివారం మెదక్ మిల్లీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొల్చారం గ్రామంలోని బాబా గార్డెన్స్‌లో నిర్వహించిన కుట్టు శిక్షణ కేంద్రంలో శిక్షణ పూర్తి చేసుకున్న 44 మంది మహిళలకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలపై కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉంటాయని, వారు ఆర్థికంగా ఎదిగి స్వతంత్రంగా జీవించాలనే ఉద్దేశంతో మూడు నెలల పాటు కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలు తాము స్వయంగా కుట్టిన వివిధ రకాల దుస్తులను ప్రదర్శించడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహిళలు తమ శిక్షణ అనుభవాలను పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. కులమతాలకు అతీతంగా మహిళలకు శిక్షణ అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కొల్చారంలో మెహందీ డిజైన్ శిక్షణ శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సుప్రీం బాడీ సభ్యులు జాఫర్ ఉల్లా తాహెర్, షేక్ ఫజల్ అహ్మద్, అడ్వకేట్ రియాజ్, సయ్యద్ సదత్ అలీ, మహమ్మద్ రియాజుద్దీన్, సిద్ధిక్ మియొద్దీన్, అబ్బాస్, సద్దాం, అఫ్సర్, శిక్షకురాలు హైమాది బేగం, సెంటర్ ఇన్‌చార్జి సానియా సమీరా, మసీదు ఇమామ్ గౌస్ ఆలం, ఖదీర్, షాబొద్దీన్, సమీర్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.