ఎన్నికల సిబ్బందికి శిక్షణా తరగతులు
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఆత్మకూరు మండలంలో 500 మంది పిఓ, ఏపిఓ లకు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ ఆత్మకూరు నందు శనివారం శిక్షణ కార్యక్రమం నిర్వహించబడినది. ఈ కార్యక్రమం నందు ఎంపీడీవో పి. రఫీఖాన్ పాల్గొని క్రమబద్ధమైన ఎన్నికల నిర్వహణ కోసము పలు సూచనలు జారీ చేశారు. శిక్షకులు కే రవీంద్ర మరియు ఎస్డి కరిముల్లా 500 మంది పిఓ ఏపిఓ లకు శిక్షణను ఇచ్చారు.