BREAKING
బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి కమలాకర్ రెడ్డి ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలి – బోరేగావ్ సర్పంచ్ నగేందర్ పాటిల్ పీహెచ్‌డీ వైవా విజయవంతంగా పూర్తి చేసిన తిరుమల రూపేష్ భక్తిపారవశ్యంలో కోటి దీపోత్సవం.. ఆధ్యాత్మిక శోభతో ఆలయ ప్రాంగణం మిలటరీ గ్రామం లోని జిల్లా పరిషత్ హై స్కూల్ నందు “సురక్షిత్ బచ్పన్ అభియాన్” పై అవగాహన సదస్సు" కూటమి బలపరిచిన కోవూరు సర్పంచి అభ్యర్థిగా వల్లెపు సునీల్ బాబు పంటపాలెం పారిశ్రామిక ప్రాంతంలో 132 కేవీ సబ్‌స్టేషన్ ఏర్పాటుకు ప్రతిపాదన చేయాలని ఎస్‌ఈని కోరిన పారిశ్రామిక వినియోగదారులు బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి కమలాకర్ రెడ్డి ఎన్నికల అధికారులకు శిక్షణ..! జన సందోహం మధ్య... సర్పంచ్ అభ్యర్థిగా ఆలపాక నామినేషన్ సౌత్ మోపూర్ సర్పంచ్ బరిలో బండి అంకమ్మ ఆత్మకూరు మండలంలో ఏకగ్రీవం కానున్న పలు పంచాయతీలు విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి ప్రజారోగ్యమే ప్రథమ ప్రాధాన్యత.. మంచినీటి ట్యాంక్ డీప్ క్లీనింగ్‌కు కార్పొరేటర్ విజయలక్ష్మి చర్యలు! ఆత్మీయ పలకరింపులతో ముగిసిన చివరి కౌన్సిల్ సమావేశం

సర్పంచ్ అభ్యర్థిగా పొట్నూరు వాణి సాయి ప్రసాద్ నామినేషన్

Select Suryaa Now
సర్పంచ్ అభ్యర్థిగా పొట్నూరు వాణి సాయి ప్రసాద్ నామినేషన్

 

నరసన్నపేట నవంబర్ 21 మేజర్ న్యూస్: నరసన్నపేట మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పొట్నూరు వాణి సాయిప్రసాద్ శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ఇందిరా నగర్‌లోని తమ నివాసం నుంచి అనుచరులతో కలిసి ర్యాలీగా బయలుదేరి మేజర్ పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నారు. నిర్ణయించిన ముహూర్త సమయంలో ఎన్నికల అధికారి నారాయణదాసుకు నామినేషన్ పత్రాలను అందజేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ నరసన్నపేట పట్టణంలోని ప్రధాన సమస్యలపై తమకు పూర్తి అవగాహన ఉందని తెలిపారు. పట్టణ సమస్యలను పరిష్కరించి అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రజలందరూ తమకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల నిర్వహిస్తున్న ఇంటింటి ప్రచారంలో ప్రజల నుంచి సమస్యలు, ఫిర్యాదులను స్వీకరిస్తున్నామని, వాటి పరిష్కారానికి అవసరమైన మార్గాలను అన్వేషిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలందరూ తమ సమస్యలపై ఫిర్యాదుల పుస్తకం ద్వారా తెలియజేయవచ్చునని కూడా వివరించారు. పట్టణ అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధంగా ఉందని, అవినీతికి తావులేని పాలనతో పాటు అభివృద్ధినే ప్రధాన అజెండాగా ముందుకు సాగుతామని హామీ ఇచ్చారు. పలువురు వార్డు సభ్యులు కూడా నామినేషన్ పత్రాలను అందించారు.

**  ర్యాలీని అడ్డుకున్న పోలీసులు..

 ఇందిరానగర్ నుంచి నరసన్నపేట ప్రధాన రహదారి మీదుగా ర్యాలీగా బయలుదేరిన అభ్యర్థి పొట్నూరు వాణి సాయి ప్రసాద్, అనుచరులను సీఐ ఎం. శ్రీనివాసరావు అడ్డుకున్నారు. ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించేందుకు అనుమతి లేదని, మార్గం మార్చుకుని సంతపేట మీదుగా వెళ్లాలని సూచించారు. దీంతో మాజీ సర్పంచ్ బూరళ్లి శంకర్‌తో పాటు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పోలీసుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. అధికార పార్టీ ర్యాలీలకు అనుమతిస్తూ తమ ర్యాలీని ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులను ప్రశ్నించారు.

దీనిపై సీఐ స్పందిస్తూ ఎన్నికల నియమావళి ప్రకారం ర్యాలీల నిర్వహణకు నిబంధనలు వర్తిస్తాయని, ముందస్తు అనుమతి తీసుకుంటే నిబంధనలకు అనుగుణంగా కొన్ని మినహాయింపులు ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. అనంతరం పొట్నూరు వాణి సాయిప్రసాద్ ర్యాలీ మార్గాన్ని మార్చుకుని సంతపేట మీదుగా పంచాయతీ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు.