పీహెచ్‌డీ వైవా విజయవంతంగా పూర్తి చేసిన తిరుమల రూపేష్
అనంతపురం విద్య మేజర్ న్యూస్ :-బాలాజీ ఫార్మసీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జి. తిరుమల రూపేష్ పీహెచ్‌డీ మౌఖిక పరీక్ష (వైవా) విజయవంతంగా పూర్తి చేసి డాక్టరేట్‌కు అర్హత సాధించారు. జేఎన్‌టీయూ ఓటీపీఆర్‌ఐ సంచాలకులు ఆచార్య జి.వి. సుబ్బారెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం, బెంజోథియజోల్ డెరివేటివ్స్‌పై యాంటీ ట్యూబర్కులర్ పరిశోధనలను బాలాజీ ఫార్మసీ కళాశాల ఆచార్య ఎం. గీతావాణి పర్యవేక్షణలో నిర్వహించారు. పరిశోధన గ్రంథం, వ్యాసాలను ప్రచురించారు. వైవాకు ఇండియన్ ఫార్మాకోపియా కమిషన్ ప్రిన్సిపల్ సైంటిఫిక్ ఆఫీసర్ డా. కలైవాణి ఎక్స్‌టర్నల్ ఎగ్జామినర్‌గా వ్యవహరించారు.
ఈ సందర్భంగా రూపేష్‌కు జేఎన్‌టీయూ అధికారులు, కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపల్ డా. ప్రదీప్ కుమార్, అధ్యాపకులు అభినందనలు తెలిపారు.
మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్..