నూతన సర్పంచులకు అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు
పర్చూరు, మేజర్‌న్యూస్:
పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటుతోంది. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు నాయకత్వంలో పర్చూరు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థులకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ప్రజల మద్దతుతో ఆరు మండలాల పరిధిలో 31 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం కూటమి ప్రజాబలానికి నిదర్శనంగా నిలుస్తోంది.
మార్టూరు, యద్దనపూడి, పర్చూరు, కారంచేడు, ఇంకొల్లు, చిన్నగంజాం మండలాల్లో ఏకగ్రీవ విజయాలు నమోదు కావడం పట్ల ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు హర్షం వ్యక్తం చేశారు. నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులకు అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి మాట్లాడుతూ.. ప్రజలు తమపై ఉంచిన నమ్మకం, విశ్వాసానికి ఈ ఏకగ్రీవ విజయాలు ప్రతీకలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు మద్దతుగా నిలుస్తున్నారని తెలిపారు. గ్రామాల అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని నూతనంగా ఎన్నికైన సర్పంచులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలులో చురుగ్గా వ్యవహరించాలని ఆకాంక్షించారు.
మండలాల వారీగా ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులు:
మార్టూరు మండలం (5):
1. డేగరమూడి – జ్యోతి శ్రీనివాసరావు
2. నాగరాజుపల్లి – భూక్యా రాజా నాయక్
3. కొనంకి – కోటపాటి కోమలి
4. దర్శి – కామేపల్లి పద్మ
5. రాజుపాలెం – శాకమూరి పద్మావతి
యద్దనపూడి మండలం (4):
1. గన్నవరం – నల్లపనేని వీరమ్మ
2. మున్నంగివారిపాలెం – దొడ్డ నాగబాబు
3. యనమదల – కార్లపూడి శ్రీలక్ష్మి
4. తనుబొద్ధివారిపాలెం – కురకుల దయాదాసు
పర్చూరు మండలం (10):
1. పర్చూరు – కోడూరి శేష బ్రహ్మచారి
2. ఇనగల్లు – పారి కోటేశ్వరమ్మ
3. అడుసుమల్లి – రావి రవీంద్రబాబు
4. తన్నీరువారిపాలెం – యెందెటి దుర్గాభవాని
5. తిమ్మరాజుపాలెం – గొరంట్ల రామకృష్ణ
6. ఉప్పుటూరు – మువ్వ శైలజ
7. నాగులపాలెం – కొల్లా రజిని
8. దేవరపల్లి – కొమ్మలపాటి రాధిక
9. కొల్లవారిపాలెం – జెర్రిపోతుల నాగయ్య
10. చెన్నుబొట్లవారిపాలెం – గద్దే కోటేశ్వరరావు
కారంచేడు మండలం (4):
1. పోతినవారిపాలెం – పోతిన రాధిక
2. నాయుడువారిపాలెం – గుమ్మడి రామ్మోహన్ రావు
3. కొడవలివారిపాలెం – యారం అశోక్
4. తిమిడితపాడు – దండ సీతామహాలక్ష్మి
ఇంకొల్లు మండలం (4):
1. పూసపాడు – కరణం రమేష్2. సూ దివారిపాలెం – గోరంట్ల హైమావతి
3. ఇడుపులపాడు – పేర్ని బాపయ్య
4. భీమవరం – గొల్ల చైతన్య
చిన్నగంజాం మండలం (4):
1. సంతరావూరు – ఉప్పుతోళ్ల ఆదిశేషు
2. నీలాయపాలెం – తుమాటి మాధురి లత3. గొనసపూడి – కట్టెం సుసన్న
4. కడవకుదురు – పొట్లూరి శ్రీనివాసరావు
అలాగే పర్చూరు మండలం కొత్తపాలెం గ్రామ ఉపసర్పంచ్‌గా టి. మంజుల, పర్చూరు ఉప సర్పంచ్ గా తంగళ్ళ మల్లికార్జున్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఆరు మండలాల్లో 31 మంది సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పర్చూరు నియోజకవర్గంలో కూటమి రాజకీయ బలానికి, గ్రామస్థాయిలో పార్టీకి ఉన్న ఆదరణకు ప్రతిబింబమని టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి