BREAKING
కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు మంచం.. కత్తెర .. ఉంగరం.. బుట్ట.. వంకాయ! నలుగురు నిందితుల అరెస్ట్… కారంచేడు అరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వీడి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయండి వందవాగలి గ్రామ సర్పంచ్ గా సత్యనారాయణ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక నేటి నుండి ​ఐదు జిల్లాల పాత కేసుల విచారణ ​క్యాంప్ కోర్టు నోడల్ అధికారి బొగ్గరం తారక నరసింహ కుమార్ వెల్లడి పామూరు అభివృద్ధికి ఒక్క అవకాశం ఇవ్వండి ఎంపీపీ పువ్వాడికి ఘన సత్కారం ఏకగ్రీవ ఉపసర్పంచ్ ఏలూరి కి ఎంపీపీ పువ్వాడి సత్కారం చౌట్ పల్లి పీ.హెచ్.సీ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ - డిప్యూటేషన్లు రద్దు చేయాలని డీఎంహెచ్ఓకు ఆదేశం ఎం.ఎస్.ఎం.ఇల ప్రోత్సాహానికి హ్యాండ్‌హోల్డింగ్ కార్యక్రమం కలెక్టర్ పిలుపుతో జ్ఞాన కేంద్రంగా కలెక్టరేట్ గ్రంథాలయం చెస్‌ పోటీల్లో అనంతలక్ష్మి విద్యార్థికి సౌత్‌ జోన్‌ జట్టులో చోటు నిల్వల వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలి కర్నూలు కలెక్టర్ డాక్టర్ ఏ సిరి హెచ్చరిక జనవరి 31 వరకు నిల్వ పరిమితులు అమలు

ఎం.ఎస్.ఎం.ఇల ప్రోత్సాహానికి హ్యాండ్‌హోల్డింగ్ కార్యక్రమం

Select Suryaa Now
ఎం.ఎస్.ఎం.ఇల ప్రోత్సాహానికి హ్యాండ్‌హోల్డింగ్ కార్యక్రమం

గుంటూరు :  సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎం.ఎస్.ఎం.ఇ) అభివృద్ధిని ప్రోత్సహిస్తూ, నూతన వ్యాపారాలు పారిశ్రామిక యూనిట్ల స్థాపనకు అవసరమైన ఆర్థిక సహకారం, మార్గదర్శకత్వం అందించేందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గుంటూరు ప్రాంతీయ కార్యాలయంలో ఎం.ఎస్.ఎం.ఇ  హ్యాండ్‌హోల్డింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విజయవాడ జోన్ జనరల్ మేనేజర్, ఎస్.ఎల్.బి.సి కన్వీనర్ కట్టా శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కొత్త సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించడం, స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించడం, స్థానిక ఆర్థికాభివృద్ధికి తోడ్పడడం ఈ కార్యక్రమ లక్ష్యమని తెలిపారు. గుంటూరు ప్రాంతీయ కార్యాలయంలో ప్రతి నెల మొదటి, మూడవ శనివారాల్లో ఎం.ఎస్.ఎం.ఇ హ్యాండ్‌ హోల్డింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామ న్నారు. అక్టోబర్ 3న ప్రారంభమైన ఈ కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతున్నా యని చెప్పారు. రుణ దరఖాస్తులు, ప్రాజెక్టు నివేదికలు, ప్రభుత్వ పథకాలతో అనుసంధానం, వ్యాపార సలహాలు, సంబంధిత శాఖల సమన్వయం వంటి అంశాల్లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవసరమైన సహకారం అందించనున్నట్లు తెలిపారు.యూనియన్ బ్యాంక్ ప్రాంతీయ అధిపతి హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, బ్యాంకుల ద్వారా లభించే రుణ సదుపాయాలు, అర్హతలు, దరఖాస్తు విధానం, ప్రాజెక్టు నివేదికల తయారీ, వ్యాపార ప్రణాళిక, మార్కెట్ అనుసంధానం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఎస్.ఎల్.బి.సి చీఫ్ మేనేజర్ జి. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తమ వ్యాపార అవసరాలు, రుణ ప్రతిపాదనలు, సందేహాలకు తగిన  సూచనలు, సలహాలు పొందాలని సూచించారు. నవంబర్ 7న నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల రుణ ప్రతిపాదనలను పరిశీలించి, అర్హతలు, బ్యాంకింగ్ నిబంధనలకు అనుగుణంగా ఐదుగురికి రుణాలు మంజూరు చేశారు. జనరల్ మేనేజర్, ఎస్.ఎల్.బి.సి కన్వీనర్ కట్టా శ్రీధర్ బాబు, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి. విజయలక్ష్మి లబ్ధిదారులకు రుణ మంజూరు పత్రాలు అందజేశారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, ఎం.ఎస్.ఎం.ఇ ప్రతినిధులు, బ్యాంకు ఖాతాదారుల విశేష భాగస్వామ్యంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.ఈ కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ మహిపాల్ రెడ్డి, డి.ఆర్.డి.ఏ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ కేశవ, యు.బి.ఐ శిక్షణ కేంద్రం డైరెక్టర్ సందీప్ బాబు,వివిధ ప్రాంతాల నుంచి సుమారు 80 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ఎం.ఎస్.ఎం.ఇ  ప్రతినిధులు, బ్యాంకు ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు.

 

సూర్య నాయక్