BREAKING
కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు మంచం.. కత్తెర .. ఉంగరం.. బుట్ట.. వంకాయ! నలుగురు నిందితుల అరెస్ట్… కారంచేడు అరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వీడి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయండి వందవాగలి గ్రామ సర్పంచ్ గా సత్యనారాయణ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక నేటి నుండి ​ఐదు జిల్లాల పాత కేసుల విచారణ ​క్యాంప్ కోర్టు నోడల్ అధికారి బొగ్గరం తారక నరసింహ కుమార్ వెల్లడి పామూరు అభివృద్ధికి ఒక్క అవకాశం ఇవ్వండి ఎంపీపీ పువ్వాడికి ఘన సత్కారం ఏకగ్రీవ ఉపసర్పంచ్ ఏలూరి కి ఎంపీపీ పువ్వాడి సత్కారం చౌట్ పల్లి పీ.హెచ్.సీ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ - డిప్యూటేషన్లు రద్దు చేయాలని డీఎంహెచ్ఓకు ఆదేశం ఎం.ఎస్.ఎం.ఇల ప్రోత్సాహానికి హ్యాండ్‌హోల్డింగ్ కార్యక్రమం కలెక్టర్ పిలుపుతో జ్ఞాన కేంద్రంగా కలెక్టరేట్ గ్రంథాలయం చెస్‌ పోటీల్లో అనంతలక్ష్మి విద్యార్థికి సౌత్‌ జోన్‌ జట్టులో చోటు నిల్వల వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలి కర్నూలు కలెక్టర్ డాక్టర్ ఏ సిరి హెచ్చరిక జనవరి 31 వరకు నిల్వ పరిమితులు అమలు

కలెక్టర్ పిలుపుతో జ్ఞాన కేంద్రంగా కలెక్టరేట్ గ్రంథాలయం

Select Suryaa Now
కలెక్టర్ పిలుపుతో జ్ఞాన కేంద్రంగా కలెక్టరేట్ గ్రంథాలయం

బాపట్ల, మేజర్‌న్యూస్‌:

 అన్ని దానాల కన్నా విద్యా దానం గొప్పది పుస్తక జ్ఞానాన్ని  పది మందికి పంచాలన్న ఉద్దేశం జిల్లా కలెక్టరేట్ లో   గ్రంధాలయం ఏర్పాటు చేయడం జరిగింది. ఉద్యోగుల్లో పఠనాసక్తిని పెంపొందించి, విజ్ఞానాన్ని అందరికీ చేరువ చేయాలనే లక్ష్యంతో కలెక్టర్ డా. వినోద్ కుమార్ వి., ఐఏఎస్ చొరవతో కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన గ్రంథాలయానికి శనివారం 90 పుస్తకాలు బహుకరించారు.

బత్తుల వెంకటసుబ్బమ్మ అండ్ కృష్ణమూర్తి చారిటబుల్ ట్రస్ట్ తరఫున సంస్థ వ్యవస్థాపకులు డా. బి. శరత్ బోస్ 18 పుస్తకాలు, మానవత స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున అధ్యక్షులు గురజాల శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీ ఎం. జ్యోతిర్మయి, సభ్యులు డా. ఐ. శ్రీనివాసరావు 22 పుస్తకాలు అందజేశారు. మార్టూరు వివేకానంద నెక్స్ట్ జనరేషన్ స్కూల్ డైరెక్టర్ డా. వేలూరి కృష్ణమూర్తి మరో 50 పుస్తకాలను బహుకరించారు. దాతలు పుస్తకాలను కలెక్టర్‌కు అందించారు.

సామాజిక, సాంస్కృతిక అంశాలకు సంబంధించిన పుస్తకాలు పాఠకులకు ఉపయోగపడతాయని మానవత సంస్థ అధ్యక్షులు గురజాల శ్రీనివాసరావు తెలిపారు. కలెక్టర్ చొరవతో గ్రంథాలయం ఏర్పాటు కావడం అభినందనీయమని, దాని అభివృద్ధికి సంస్థ తరఫున సహకారం కొనసాగిస్తామని పేర్కొన్నారు.

గ్రంథాలయానికి పుస్తకాలు అందించిన దాతలను కలెక్టర్ అభినందించారు. పుస్తక పఠనం వ్యక్తిగత విజ్ఞానాన్ని పెంపొందించడంతో పాటు సమాజ అభివృద్ధికి దోహదపడుతుందని, గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.