BREAKING
కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు మంచం.. కత్తెర .. ఉంగరం.. బుట్ట.. వంకాయ! నలుగురు నిందితుల అరెస్ట్… కారంచేడు అరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వీడి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయండి వందవాగలి గ్రామ సర్పంచ్ గా సత్యనారాయణ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక నేటి నుండి ​ఐదు జిల్లాల పాత కేసుల విచారణ ​క్యాంప్ కోర్టు నోడల్ అధికారి బొగ్గరం తారక నరసింహ కుమార్ వెల్లడి పామూరు అభివృద్ధికి ఒక్క అవకాశం ఇవ్వండి ఎంపీపీ పువ్వాడికి ఘన సత్కారం ఏకగ్రీవ ఉపసర్పంచ్ ఏలూరి కి ఎంపీపీ పువ్వాడి సత్కారం చౌట్ పల్లి పీ.హెచ్.సీ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ - డిప్యూటేషన్లు రద్దు చేయాలని డీఎంహెచ్ఓకు ఆదేశం ఎం.ఎస్.ఎం.ఇల ప్రోత్సాహానికి హ్యాండ్‌హోల్డింగ్ కార్యక్రమం కలెక్టర్ పిలుపుతో జ్ఞాన కేంద్రంగా కలెక్టరేట్ గ్రంథాలయం చెస్‌ పోటీల్లో అనంతలక్ష్మి విద్యార్థికి సౌత్‌ జోన్‌ జట్టులో చోటు నిల్వల వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలి కర్నూలు కలెక్టర్ డాక్టర్ ఏ సిరి హెచ్చరిక జనవరి 31 వరకు నిల్వ పరిమితులు అమలు

నిల్వల వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలి కర్నూలు కలెక్టర్ డాక్టర్ ఏ సిరి హెచ్చరిక జనవరి 31 వరకు నిల్వ పరిమితులు అమలు

Select Suryaa Now
నిల్వల వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలి కర్నూలు కలెక్టర్ డాక్టర్ ఏ సిరి హెచ్చరిక జనవరి 31 వరకు నిల్వ పరిమితులు అమలు


కర్నూలు, మేజర్ న్యూస్ ప్రతినిధి:
బియ్యం నిల్వలు, ధరలపై నియంత్రణకు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను వ్యాపారులు తప్పనిసరిగా పాటించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి బియ్యం వ్యాపారస్తులకు సూచించారు. బియ్యం ధరలు పెరగకుండా, వినియోగదారులకు అందుబాటులో ఉండేలా కేంద్ర ప్రభుత్వం నిల్వ పరిమితులు విధించిందని తెలిపారు. జిల్లాలోని మిల్లర్లు, హోల్‌సేల్ వ్యాపారులు, రిటైలర్లు, ట్రేడర్లు, బిగ్ చైన్ రిటైలర్లు ఈ నిబంధనలకు అనుగుణంగా తమ నిల్వల వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు. ప్రతి వ్యాపారి తమ వద్ద ఉన్న వరి, బియ్యం నిల్వల వివరాలను భారత ప్రభుత్వ ఫుడ్ స్టాక్ పోర్టల్ లో నమోదు చేయడంతో పాటు, ప్రతి శుక్రవారం నిల్వల వివరాలను తెలపాలని సూచించారు. నిల్వల వివరాలు పారదర్శకంగా ఉండేలా సంబంధిత రికార్డులను నిర్వహించాలని, ధరల పట్టికలను వ్యాపార ప్రాంగణాల్లో వినియోగదారులకు కనిపించేలా ప్రదర్శించాలని పేర్కొన్నారు.
ట్రేడింగ్ రైస్ మిల్లులకు 4,000 క్వింటాళ్లు లేదా 7 రోజుల మిల్లింగ్ సామర్థ్యం, వీటిలో ఏది ఎక్కువైతే అది అలాగే హోల్‌సేల్ వ్యాపారులకు ప్రాంతాన్ని బట్టి 1,000, 500, 250 క్వింటాళ్ల నిల్వ పరిమితి.
పట్టణ ప్రాంత రిటైలర్లకు 100 క్వింటాళ్లు.
గ్రామీణ ప్రాంత రిటైలర్లకు 50 క్వింటాళ్లు.
రైతుల నుంచి సేకరించిన బియ్యం కనీస మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు చేయరాదని చెప్పారు. ప్రభుత్వం నిర్దేశించిన గరిష్ఠ నిల్వ పరిమితులను మించి నిల్వ చేయరాదని స్పష్టం చేశారు. నిబంధనల ఉల్లంఘన జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
బిపిటి, సాంబ, కేఎన్ఎమ్ రకాల బియ్యం కిలో రూ.66, హెచ్ఎంటి, ఆర్ఎన్ఆర్  రకాల బియ్యం  కిలో రూ.76  జై శ్రీరామ్ రకం బియ్యం కిలో రూ.82
ఎం టి యు  సాధారణ రకాలు  కిలో రూ.47 గా నిర్ణయించినట్లు తెలిపారు. వ్యాపారులు నిర్ణయించిన ధరలకు మాత్రమే బియ్యం విక్రయించాలని, అధిక ధరలకు విక్రయించి వినియోగదారులపై భారం మోపరాదని కలెక్టర్ సూచించారు. బియ్యం నిల్వలు, ధరల వివరాలను ఆన్‌లైన్‌లో సక్రమంగా నమోదు చేయాలని, నిబంధనలను పాటించని వారిపై తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ నిల్వ పరిమితులు వచ్చే ఏడాది జనవరి 31 వరకు అమల్లో ఉంటాయని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి వెల్లడించారు. జిల్లాలోని బియ్యం వ్యాపారులందరూ ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించి సహకరించాలని కోరారు.