చెస్ పోటీల్లో అనంతలక్ష్మి విద్యార్థికి సౌత్ జోన్ జట్టులో చోటు
అనంతపురం విద్య మేజర్ న్యూస్:-అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి అవారి ఉదయకుమార్ జేఎన్‌టీయూ అనంతపురం అంతర్ కళాశాల చెస్ పోటీల్లో ప్రతిభ కనబరిచి సౌత్ జోన్ జట్టుకు ఎంపికయ్యాడు. తిరుపతిలోని శ్రీరామ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన పురుషుల చెస్ పోటీల్లో బీటెక్ విద్యార్థి ఉదయకుమార్ ఈ ఘనత సాధించినట్లు కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ కుటాల శ్రీనివాసులు తెలిపారు.
విద్యార్థి సాధించిన విజయంపై కళాశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపింది. జాతీయ స్థాయిలోనూ రాణించి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించింది.
కళాశాల ఛైర్మన్ అనంతరాముడు, ప్రధానాచార్యులు డాక్టర్ కుటాల శ్రీనివాసులు, నైపుణ్యాభివృద్ధి సంచాలకులు, ప్రాంగణ నియామకాల విభాగం, క్రీడా సంచాలకులు మల్లికార్జున, బి. ధనలక్ష్మి, అధ్యాపకులు, విద్యార్థులు ఉదయకుమార్‌ను అభినందించారు.
మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్..