BREAKING
ఎన్ని పొర్లు దండాలు పెట్టిన, కుప్పిగెంతులు వేసిన అధికారంలోకి రావడం జగన్మోహన్ రెడ్డికి పగటి కలే ఎమ్మెల్సీ వర్ల రామయ్య ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండండి... ప్రతి ఓటర్ ను కలవండి. ఎమ్మెల్యే శాస్త్రృక్తంగా తులసీ దామోదర, గో వృషభ కళ్యాణాలు చరిత్రలో నిలిచిపోయేలా నితిన్ నబీన్ ‘మహా పాదయాత్ర’’కు ఏర్పాట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ పెంచలకోనలో వైభవంగా చిలుక ద్వాదశి ఉత్సవాలు తల్పగిరి రంగనాధ స్వామి ఆలయంలో వైభవంగా చిలుక ద్వాదశి వేడుక సోమవారం జీఎంసీ 'పీజీఆర్ఎస్' రద్దు: కమిషనర్ కె. మయూర్ అశోక్ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు మంచం.. కత్తెర .. ఉంగరం.. బుట్ట.. వంకాయ! నలుగురు నిందితుల అరెస్ట్… కారంచేడు అరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వీడి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయండి వందవాగలి గ్రామ సర్పంచ్ గా సత్యనారాయణ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక నేటి నుండి ​ఐదు జిల్లాల పాత కేసుల విచారణ ​క్యాంప్ కోర్టు నోడల్ అధికారి బొగ్గరం తారక నరసింహ కుమార్ వెల్లడి పామూరు అభివృద్ధికి ఒక్క అవకాశం ఇవ్వండి

నేటి నుండి ​ఐదు జిల్లాల పాత కేసుల విచారణ ​క్యాంప్ కోర్టు నోడల్ అధికారి బొగ్గరం తారక నరసింహ కుమార్ వెల్లడి

Select Suryaa Now
నేటి నుండి ​ఐదు జిల్లాల పాత కేసుల విచారణ  ​క్యాంప్ కోర్టు నోడల్ అధికారి బొగ్గరం తారక నరసింహ కుమార్ వెల్లడి

గుంటూరు :  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్  ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీ నుండి 27వ తేదీ వరకు గుంటూరు కేంద్రంగా ప్రత్యేక క్యాంపు కోర్టు నిర్వహించ నున్నట్లు క్యాంప్ కోర్టు నోడల్ అధికారి బొగ్గరం తారక నరసింహ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్  నిబంధనావళి, 2013లోని 5వ నిబంధన ప్రకారం, కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి.ఈ క్యాంపు కోర్టులో గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం మార్కాపురం జిల్లాలకు సంబంధించిన కేసులను పరిశీలిస్తారు.​ఆయా జిల్లాల పరిధిలో ఇప్పటికే కమిషన్ వద్ద నమోదై పెండింగ్‌లో ఉన్న మానవ హక్కుల ఉల్లంఘన కేసులపై విచారణ చేపడతారు.​మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించి ప్రజల నుండి నూతన ఫిర్యాదులను అక్కడికక్కడే స్వీకరిస్తారు.పెండింగ్ కేసులకు సంబంధించిన ఆయా జిల్లాల ప్రభుత్వ అధికారులు విధిగా ఈ క్యాంపు కోర్టుకు హాజరుకావాలని ఆదేశాలు జారీ అయ్యాయి.మానవ హక్కుల ఉల్లంఘనకు గురైన బాధితులు, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నోడల్ అధికారి కోరారు

సూర్య నాయక్