శాస్త్రృక్తంగా తులసీ దామోదర, గో వృషభ కళ్యాణాలు
అనంతపురం మేజర్ న్యూస్ ప్రతినిధి:-పవిత్ర కార్తీక మాసంలో క్షీరాబ్ధి ద్వాదశిని పురస్కరించుకొని సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో కొల్హాపూర్ మహాలక్ష్మి దేవాలయం వలి స్వామి ఆశ్రమంలో తులసీ దామోదర కళ్యాణం, గురు గో వృషభ కళ్యాణాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. పురోహితులు పుబ్బ రాజ విజయ్ కుమార్ వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ వేడుకలకు సాయి ట్రస్ట్ అధ్యక్షుడు విజయ సాయికుమార్ మాతృమూర్తి శ్రీమతి వై. రుక్మిణి ఆర్థిక సహకారం అందించారు.
ఈ కార్యక్రమంలో వలి స్వామి ఆశ్రమ నిర్వాహకులు డీఎస్ విజయ్ కుమార్, సాయి ట్రస్ట్ అధ్యక్షుడు విజయ సాయికుమార్, ఆశ్రమ కార్యనిర్వాహక సభ్యులు జయచంద్ర రెడ్డి, సరస్వతమ్మ, నాగభూషణం, చంద్రశేఖర్ బాబు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్