మేయర్, కౌన్సిల్ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు సిద్దం: నగర కమిషనర్
గుంటూరు : గుంటూరు నగర పాలక సంస్థ నూతన మేయర్, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారోత్సవానికి జిఎంసి ప్రధాన కార్యాలయంలో తగిన ఏర్పాట్లు సిద్దం చేశామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. శనివారం కమిషనర్ జిఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో ఏర్పాట్లు పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై జిఎంసి అధికారులు, పోలీసు అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మేయర్, సభ్యుల ప్రమాణ స్వీకారంకు తగిన డాక్యుమెంట్స్ సిద్దం చేసుకోవాలని, హాల్లో ఎక్స్ అఫీషియో సభ్యులు, ప్రతి సభ్యునికి నేమ్ బోర్డ్ లతో సీటింగ్, ప్రమాణస్వీకార పత్రం సిద్దం చేయాలని కౌన్సిల్ సెక్రెటరిని ఆదేశించారు. సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమం లైవ్ లింక్ తో పాటు, రికార్డ్ కూడా అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమానికి సంబందించి మినిట్ టు మినిట్ పేపర్ సిద్దం చేయాలన్నారు. కౌన్సిల్ సభ్యులకు ఇప్పటికే ఎంట్రీ పాస్ లు పంపిణీ చేశామని, పాస్ లు లేని ఇతర వ్యక్తులు హాల్ లేదా జిఎంసి ప్రాంగణంలోకి రాకుండా బందోబస్త్ చేపట్టాలని పోలీసు అధికారులకు తెలిపారు. కార్యక్రమానికి వచ్చే వారి వాహనాల పార్కింగ్ గాంధీ పార్క్, వెంకటేశ్వర విజ్ఞాన మందిరం పార్కింగ్ స్థలాలను వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమాని హాజరయ్యే కౌన్సిల్ సభ్యుల కుటుంబ సభ్యులకు, మీడియా ప్రతినిధులకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఎస్ఈని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు ఐ.కిషోర్, రవీంద్రబాబు, డిప్యూటీ కమిషనర్లు బి.శ్రీనివాసరావు, జి.సాంబశివరావు, సిహెచ్.శ్రీనివాస్, సిటి ప్లానర్ డి.రాంబాబు, ఎస్ఈ జి.వెంకటేశ్వరరావు, ఈఈ డి.సుందర్రామిరెడ్డి పాల్గొన్నారు.
సూర్య నాయక్