BREAKING
బాడంగిలో సర్పంచ్ స్థానాలకు హోరాహోరీ పోటీ ఐదు పంచాయతీల్లో ఏకగ్రీవం.. 20 పంచాయతీల్లో ఎన్నికలు జిఎంసి ఎల్ఆర్ఎస్ మేళాకి 280 దరఖాస్తులు మేయర్, కౌన్సిల్ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు సిద్దం: నగర కమిషనర్ వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థిగా ఎల్.ఇ. పుష్పవతి నామినేషన్ వైసిపి గూటికి తిరిగి చేరిన గొల్ల రాఘవేంద్ర... అమెరికాలో భారీ రైలు దోపిడీ.. 36కి పైగా రైళ్ల నుంచి రూ.1,900 కోట్ల విలువైన సరుకు చోరీ! హెబ్బటం గ్రామ సర్పంచ్ రాలుగా బోయ గుబ్బల్లి సవారమ్మ ఏకగ్రీవంగా ఎన్నిక దాడులకు పాల్పడిన వైసీపీ గుండాలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీకి వినతి రోడ్డు ప్రమాద బాధితులకు ప్రభుత్వం అఅండగా ఉంటుంది ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య హుస్సేనాపురంలో టీడీపీ ప్రచార జోరు.. రాముకు మద్దతుగా నేతల విస్తృత ప్రచారం! ​నామినేషన్ దాఖలు చేసిన బండికారి లక్ష్మి తులసి ఎన్ని పొర్లు దండాలు పెట్టిన, కుప్పిగెంతులు వేసిన అధికారంలోకి రావడం జగన్మోహన్ రెడ్డికి పగటి కలే ఎమ్మెల్సీ వర్ల రామయ్య ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండండి... ప్రతి ఓటర్ ను కలవండి. ఎమ్మెల్యే శాస్త్రృక్తంగా తులసీ దామోదర, గో వృషభ కళ్యాణాలు చరిత్రలో నిలిచిపోయేలా నితిన్ నబీన్ ‘మహా పాదయాత్ర’’కు ఏర్పాట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్

దాడులకు పాల్పడిన వైసీపీ గుండాలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీకి వినతి

Select Suryaa Now
దాడులకు పాల్పడిన వైసీపీ గుండాలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీకి వినతి

అమరావతి, మేజర్‌న్యూస్‌ :

రాష్ట్రంలో జరుగుతున్న మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా పల్నాడు జిల్లాలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు దాడులకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ నేతల బృందం నేడు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, ఎమ్మెల్సీ వర్ల రామయ్య, మాజీ ఎమ్మెల్సీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్చూరి అశోక్ బాబు, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఛైర్మన్ ఎస్. రాజశేఖర్, ఏపీ బయోడైవర్సిటీ ఛైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్‌లతో కూడిన బృందం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠాను కలిసి ఈ మేరకు సమగ్ర లిఖితపూర్వక ఫిర్యాదును అందజేసింది. పిడుగురాళ్ల మండలం, చెన్నాయపాలెంలో నేడు పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు వేసి తిరిగి వెళ్తున్న టీడీపీ మద్దతుదారులపై వైసీపీ కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దాడి చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ దాడిలో పలువురు టీడీపీ కార్యకర్తలు గాయపడటంతో పాటు, అక్కడే ఉన్న టీడీపీ ఎంపీపీ గండికోట వెంకటేశ్వర్లు కారును తీవ్రంగా ధ్వంసం చేశారని వారు తెలిపారు. మాచవరం మండలం, వేమవరంలో నామినేషన్లు వేసి తిరిగి వెళ్తున్న టీడీపీ మద్దతుదారులను దారిలో అడ్డుకుని కర్రలు, రాళ్లతో దాడి చేశారని టీడీపీ నేతలు పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేయవద్దని, వేసిన నామినేషన్లను వెంటనే ఉపసంహరించుకోవాలని బెదిరింపులకు గురిచేశారని కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. పిడుగురాళ్ల మండలం, కార్లపాళెం నామినేషన్ కేంద్రం వద్ద భద్రత కల్పిస్తున్న పోలీసులపైనే వైసీపీ శ్రేణులు దాడికి యత్నించాయని టీడీపీ బృందం ఆరోపించింది. నామినేషన్ల ప్రక్రియను అడ్డుకుని భయాందోళనలు సృష్టించేందుకు పోలీసులతో వాగ్వాదానికి దిగారని, అయితే పోలీసులు వెంటనే స్పందించి గుంపును చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చిందని వారు వివరించారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా పథకం ప్రకారమే ఈ దాడులు జరుగుతున్నాయని, తద్వారా ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని టీడీపీ నేతలు కమిషన్‌కు వివరించారు. ఈ ఘటనలకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌లు, ఫోటోలతో కూడిన పెన్ డ్రైవ్‌ను ఆధారాలుగా కమిషనర్‌కు సమర్పించారు. దాడులకు పాల్పడిన బాధ్యులపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, నిష్పక్షపాతంగా జరిగేలా తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కోరారు.