BREAKING
మందకొడిగా పల్లె పోరు నామినేషన్లు తొలి రోజు 8 సర్పంచ్, 26 వార్డు సభ్యుల నామినేషన్లు బాడంగిలో సర్పంచ్ స్థానాలకు హోరాహోరీ పోటీ ఐదు పంచాయతీల్లో ఏకగ్రీవం.. 20 పంచాయతీల్లో ఎన్నికలు జిఎంసి ఎల్ఆర్ఎస్ మేళాకి 280 దరఖాస్తులు మేయర్, కౌన్సిల్ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు సిద్దం: నగర కమిషనర్ వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థిగా ఎల్.ఇ. పుష్పవతి నామినేషన్ వైసిపి గూటికి తిరిగి చేరిన గొల్ల రాఘవేంద్ర... అమెరికాలో భారీ రైలు దోపిడీ.. 36కి పైగా రైళ్ల నుంచి రూ.1,900 కోట్ల విలువైన సరుకు చోరీ! హెబ్బటం గ్రామ సర్పంచ్ రాలుగా బోయ గుబ్బల్లి సవారమ్మ ఏకగ్రీవంగా ఎన్నిక దాడులకు పాల్పడిన వైసీపీ గుండాలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీకి వినతి రోడ్డు ప్రమాద బాధితులకు ప్రభుత్వం అఅండగా ఉంటుంది ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య హుస్సేనాపురంలో టీడీపీ ప్రచార జోరు.. రాముకు మద్దతుగా నేతల విస్తృత ప్రచారం! ​నామినేషన్ దాఖలు చేసిన బండికారి లక్ష్మి తులసి ఎన్ని పొర్లు దండాలు పెట్టిన, కుప్పిగెంతులు వేసిన అధికారంలోకి రావడం జగన్మోహన్ రెడ్డికి పగటి కలే ఎమ్మెల్సీ వర్ల రామయ్య ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండండి... ప్రతి ఓటర్ ను కలవండి. ఎమ్మెల్యే శాస్త్రృక్తంగా తులసీ దామోదర, గో వృషభ కళ్యాణాలు

జిఎంసి ఎల్ఆర్ఎస్ మేళాకి 280 దరఖాస్తులు

Select Suryaa Now
జిఎంసి ఎల్ఆర్ఎస్ మేళాకి 280 దరఖాస్తులు

గుంటూరు :గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) కింద దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేందుకు గుంటూరు నగరపాలక సంస్థ చేపట్టిన ప్రత్యేక ‘ఎల్ఆర్ఎస్ మేళా’కు నగర ప్రజల నుండి విస్తృతమైన స్పందన వచ్చిందని, ఇంకా ఎవరైనా ఉంటే వారి కోసం మరో 20 రోజుల్లో మరొకమారు మేళా నిర్వహిస్తామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. జిఎంసి నిర్వహించిన 2 రోజుల ఎల్ఆర్ఎస్ మేళాలో 280 దరఖాస్తులను ప్రాసెస్ చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో, బృందావన్ గార్డెన్స్‌లోని సర్కిల్ కార్యాలయంలో ప్రత్యేక మేళాలో పట్టణ ప్రణాళిక సిబ్బంది అందుబాటులో ఉంటున్నారన్నారు. శుక్రవారం 155, శనివారం 125 మంది ఎల్టీపీల ద్వారా హాజరై తమ దరఖాస్తుల పరిష్కారానికి ముందుకు వచ్చారన్నారు. దరఖాస్తుదారు వనుకూరి శ్రీనివాసరెడ్డి 24,14,000 చెల్లించి, దరఖాస్తుని ప్రాసెస్ చేయించుకున్నారని తెలిపారు. ప్రజల నుండి వచ్చిన స్పందన ప్రకారం మరో 20 రోజుల్లో మరోసారి ఎల్ఆర్ఎస్ మేళా నిర్వహిస్తామని, ఎవరైనా పెండింగ్ ఉంటే ఇంజినీర్లతో మాట్లాడి, నిర్దేశిత డాక్యుమెంట్స్ సిద్దం చేసుకోవాలని తెలిపారు.

 

సూర్య నాయక్