BREAKING
బాడంగిలో సర్పంచ్ స్థానాలకు హోరాహోరీ పోటీ ఐదు పంచాయతీల్లో ఏకగ్రీవం.. 20 పంచాయతీల్లో ఎన్నికలు జిఎంసి ఎల్ఆర్ఎస్ మేళాకి 280 దరఖాస్తులు మేయర్, కౌన్సిల్ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు సిద్దం: నగర కమిషనర్ వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థిగా ఎల్.ఇ. పుష్పవతి నామినేషన్ వైసిపి గూటికి తిరిగి చేరిన గొల్ల రాఘవేంద్ర... అమెరికాలో భారీ రైలు దోపిడీ.. 36కి పైగా రైళ్ల నుంచి రూ.1,900 కోట్ల విలువైన సరుకు చోరీ! హెబ్బటం గ్రామ సర్పంచ్ రాలుగా బోయ గుబ్బల్లి సవారమ్మ ఏకగ్రీవంగా ఎన్నిక దాడులకు పాల్పడిన వైసీపీ గుండాలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీకి వినతి రోడ్డు ప్రమాద బాధితులకు ప్రభుత్వం అఅండగా ఉంటుంది ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య హుస్సేనాపురంలో టీడీపీ ప్రచార జోరు.. రాముకు మద్దతుగా నేతల విస్తృత ప్రచారం! ​నామినేషన్ దాఖలు చేసిన బండికారి లక్ష్మి తులసి ఎన్ని పొర్లు దండాలు పెట్టిన, కుప్పిగెంతులు వేసిన అధికారంలోకి రావడం జగన్మోహన్ రెడ్డికి పగటి కలే ఎమ్మెల్సీ వర్ల రామయ్య ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండండి... ప్రతి ఓటర్ ను కలవండి. ఎమ్మెల్యే శాస్త్రృక్తంగా తులసీ దామోదర, గో వృషభ కళ్యాణాలు చరిత్రలో నిలిచిపోయేలా నితిన్ నబీన్ ‘మహా పాదయాత్ర’’కు ఏర్పాట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్

వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థిగా ఎల్.ఇ. పుష్పవతి నామినేషన్

Select Suryaa Now
వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థిగా ఎల్.ఇ. పుష్పవతి నామినేషన్

వెల్దుర్తి,  మేజర్ న్యూస్: వెల్దుర్తి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి ఎల్.ఇ. పుష్పవతి శనివారం నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఆర్వో) కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రంలో ఆమె తన నామినేషన్ పత్రాలను అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆమెకు మద్దతు తెలిపారు.నామినేషన్ దాఖలుకు ముందు ఆమె తన మద్దతుదారులు, గ్రామ పెద్దలతో కలిసి ర్యాలీగా ఆర్వో కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం ఎన్నికల నియమావళి ప్రకారం అవసరమైన ధ్రువపత్రాలను ఆర్వోకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ముఖ్య నాయకులు, వార్డు సభ్యులు, కుటుంబ సభ్యులు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొని పుష్పవతికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎల్.ఇ. పుష్పవతి మాట్లాడుతూ.. గ్రామ ప్రజల ఆశీస్సులతో సర్పంచ్ బరిలో నిలుస్తున్నానని తెలిపారు. వెల్దుర్తి మేజర్ పంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన ప్రధాన లక్ష్యమని, తాగునీరు, పారిశుద్ధ్యం, అంతర్గత రహదారుల మెరుగుదలకు ప్రత్యేక కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామస్తులందరూ తనకు మద్దతుగా నిలిచి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు.