హెబ్బటం గ్రామ సర్పంచ్ రాలుగా బోయ గుబ్బల్లి సవారమ్మ ఏకగ్రీవంగా ఎన్నిక
హొళగుంద సూర్య ప్రతినిధి::హెబ్బటం గ్రామ సర్పంచ్ రాలుగా బోయ గుబ్బల్లి సవారమ్మ ఏకగ్రీవంగా ఎన్నిక
కర్నూలు జిల్లా హొళగుంద మండలం హెబ్బటం గ్రామం సర్పంచ్ రాలుగా టిడిపి మద్దతు దారులైన బోయ గుబ్బల్లి సవారమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమేకు పోటీలో ఉన్న అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో ఆమే ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఉప సర్పంచ్ రాలుగా కవిత ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పోలింగ్ అధికారి డిక్లేషన్ ఫారం అందజేశారు.ఈ సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు బంధు వర్గాలు సన్నిహితులు ఆమేకు శాల్వను కప్పి పూలమాలను వేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సింగల్ విండో చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి,నాయకులు సవారప్ప, గోపాల్, మల్లికార్జున, శేక్షావలి,చిన్న నాగయ్య, గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు