BREAKING
బాడంగిలో సర్పంచ్ స్థానాలకు హోరాహోరీ పోటీ ఐదు పంచాయతీల్లో ఏకగ్రీవం.. 20 పంచాయతీల్లో ఎన్నికలు జిఎంసి ఎల్ఆర్ఎస్ మేళాకి 280 దరఖాస్తులు మేయర్, కౌన్సిల్ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు సిద్దం: నగర కమిషనర్ వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థిగా ఎల్.ఇ. పుష్పవతి నామినేషన్ వైసిపి గూటికి తిరిగి చేరిన గొల్ల రాఘవేంద్ర... అమెరికాలో భారీ రైలు దోపిడీ.. 36కి పైగా రైళ్ల నుంచి రూ.1,900 కోట్ల విలువైన సరుకు చోరీ! హెబ్బటం గ్రామ సర్పంచ్ రాలుగా బోయ గుబ్బల్లి సవారమ్మ ఏకగ్రీవంగా ఎన్నిక దాడులకు పాల్పడిన వైసీపీ గుండాలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీకి వినతి రోడ్డు ప్రమాద బాధితులకు ప్రభుత్వం అఅండగా ఉంటుంది ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య హుస్సేనాపురంలో టీడీపీ ప్రచార జోరు.. రాముకు మద్దతుగా నేతల విస్తృత ప్రచారం! ​నామినేషన్ దాఖలు చేసిన బండికారి లక్ష్మి తులసి ఎన్ని పొర్లు దండాలు పెట్టిన, కుప్పిగెంతులు వేసిన అధికారంలోకి రావడం జగన్మోహన్ రెడ్డికి పగటి కలే ఎమ్మెల్సీ వర్ల రామయ్య ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండండి... ప్రతి ఓటర్ ను కలవండి. ఎమ్మెల్యే శాస్త్రృక్తంగా తులసీ దామోదర, గో వృషభ కళ్యాణాలు చరిత్రలో నిలిచిపోయేలా నితిన్ నబీన్ ‘మహా పాదయాత్ర’’కు ఏర్పాట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్

హుస్సేనాపురంలో టీడీపీ ప్రచార జోరు.. రాముకు మద్దతుగా నేతల విస్తృత ప్రచారం!

Select Suryaa Now
హుస్సేనాపురంలో టీడీపీ ప్రచార జోరు.. రాముకు మద్దతుగా నేతల విస్తృత ప్రచారం!

ఓర్వకల్లు మేజర్ న్యూస్: హుస్సేనాపురంలో టీడీపీ ప్రచార జోరు.. రాముకు మద్దతుగా నేతల విస్తృత ప్రచారం!

- ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసిన టీటీడీ బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్ తదితర నాయకులు

- గ్రామాభివృద్ధి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చిన అభ్యర్థి సామన్నగారి రాము

మండల పరిధిలోని హుస్సేనాపురం గ్రామంలో టీడీపీ సర్పంచ్ అభ్యర్థి సామన్నగారి రాము ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. టీటీడీ బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్‌తో పాటు పార్టీ ముఖ్య నాయకులు ఆయనకు మద్దతుగా గ్రామంలో ఇంటింటికీ తిరిగి ఓటర్లను కలిశారు. ఈ సందర్భంగా రాముకు ఓటు వేసి సర్పంచ్‌గా గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.

ఈ సందర్భంగా అభ్యర్థి సామన్నగారి రాము మాట్లాడుతూ, తనను గెలిపిస్తే గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని, అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తూ హుస్సేనాపురాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు.

ఈ ప్రచార కార్యక్రమంలో నంద్యాల జిల్లా టీడీపీ ట్రెజరర్ మహబూబ్ బాషా, ఎంపీటీసీ సభ్యులు, మాజీ కాల్వబుగ్గ చైర్మన్ చంద్రపెద్దస్వామి, కొంతలపాడు సుధాకర్, పొట్టి తిరుపతి, కేవీ మధు, అన్వర్ భాష, కాల్వబుగ్గ చైర్మన్ కాటినేని నారాయణ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు.