andhrapradesh
మందకొడిగా పల్లె పోరు నామినేషన్లు తొలి రోజు 8 సర్పంచ్, 26 వార్డు సభ్యుల నామినేషన్లు
అవనిగడ్డ, మేజర్ న్యూస్: మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా అవనిగడ్డ మండలంలో నామినేషన్ల స్వీకరణ తొలిరోజు మందకొడిగా సాగింది. నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఐదు కేంద్రాలను ఏర్పాటు చేశారు. శనివారం మొత్తం 8 మంది సర్పంచ్ అభ్యర్థులు, 26 మంది వార్డు సభ్యుల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి వి. విష్ణు తెలిపారు.
మండలంలోని వివిధ గ్రామాల్లో నమోదైన నామినేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి. అవనిగడ్డలో సర్పంచ్‌కు ఒకటి, వార్డు సభ్యులకు మూడు, అశ్వరావుపాలెంలో సర్పంచ్‌కు రెండు, వార్డు సభ్యులకు ఆరు, మరో కేంద్రంలో సర్పంచ్‌కు రెండు, వార్డు సభ్యులకు ఏడు, మోదుమూడిలో సర్పంచ్‌కు ఒకటి, వార్డు సభ్యులకు మూడు, వేకనూరులో వార్డు సభ్యులకు ఒకటి, తుంగలవారిపాలెంలో సర్పంచ్‌కు ఒకటి, వార్డు సభ్యులకు ఐదు, రామకోటిపురంలో సర్పంచ్‌కు ఒకటి, వార్డు సభ్యులకు ఒక నామినేషన్ దాఖలయ్యాయి.
ఎడ్లలంక, దక్షిణ చిరువోలులంక, రామచంద్రాపురం గ్రామ పంచాయతీల్లో తొలిరోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. కాగా, మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి వి. విష్ణు, అవనిగడ్డ ఎస్‌హెచ్‌ఓ కె. శ్రీనివాసరావు మండలంలోని అన్ని నామినేషన్ కేంద్రాలను తనిఖీ చేసి ఏర్పాట్లను పరిశీలించారు.
✍️ అజంతా శ్రీనివాస్, అవనిగడ్డ, కృష్ణాజిల్లా