andhrapradesh
విద్యార్థులకు పోక్సో చట్టంపై న్యాయ విజ్ఞాన సదస్సు
అవనిగడ్డ, మేజర్ న్యూస్: విద్యార్థులకు పోక్సో చట్టంపై అవగాహన కల్పించేందుకు అవనిగడ్డ మండల లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు న్యాయమూర్తి పాండురంగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. బాలలపై లైంగిక నేరాల నిరోధానికి ఉద్దేశించిన పోక్సో చట్టంలోని అంశాలు, బాలల హక్కులు, చట్టపరమైన రక్షణలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఎంఈఓ ఎన్. శివశంకరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏజీపీ బొప్పన సుబ్రహ్మణ్యేశ్వరరావు, అవనిగడ్డ కోర్టు మీడియేటర్లు కె. ఈశ్వరరావు, తోట వీరబాబు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
ఎవిజి6 నామినేషన్ సమర్పిస్తున్న అభ్యర్థులు
మందకొడిగా పల్లె పోరు నామినేషన్లు✍️ అజంతా శ్రీనివాస్, అవనిగడ్డ, కృష్ణాజిల్లా.