రహదారిపై వడ్ల కుప్ప.. అదుపుతప్పిన బైక్
సూర్య మల్లాపూర్: జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని వాల్గొండ గ్రామ శివారులో రోడ్డుపై ఆరబోసిన వడ్ల కుప్ప కారణంగా ద్విచక్ర వాహనం అదుపుతప్పి ప్రమాదం చోటుచేసుకుంది. వాల్గొండకు చెందిన కోడిపల్లి రంజిత్‌ను మల్లాపూర్‌కు చెందిన స్నేహితులు రిశ్వంత్, పవన్ బైక్‌పై వాల్గోండాలో దింపేయటానికి వెళ్తున్న క్రమంలో వడ్ల కుప్పను గమనించకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలైనట్లు సమాచారం. ఎస్ఐ అనిల్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.