మీ ఆదరణ మరువలేనిది..
- సీతానగరం, సూర్య:
- నూతన ఎంపీపీ జొన్నాడ తేరేజమ్మ
- ప్రతి ఒక్కరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపిన ఎంపీపీ.
- అభినందనలతో ముంచెత్తిన అభిమానులకు ఎంపీపీ ధన్యవాదాలు
- మండల అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని స్పష్టీకరణ
మండల ప్రజా పరిషత్ అధ్యక్షులుగా (ఎంపీపీ) బాధ్యతలు స్వీకరించే కార్యక్రమానికి ఎంతో అభి మానంతో తరలివచ్చి ఆశీర్వదించిన నాయకులు,కార్యకర్తలు,అభిమానుల తో పాటు ప్రత్యక్షంగా,పరోక్షంగా అభి నందనలు తెలిపిన ప్రతి ఒక్కరికీ నూతన మండల పరిషత్ అధ్యక్షురాలు జొన్నాడ తేరేజమ్మ హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈసం దర్భంగా శనివారం నాడు మండల పరిషత్ అధ్యక్షురాలు జొన్నాడ తేరేజమ్మ మాట్లాడారు .తన పదవీ ప్రమాణ స్వీకార వేడుకను విజయవం తం చేయడం పట్ల ఎంపీపీ ఆనందం వ్యక్తం చేశారు.మండ లంలోని ప్రజా ప్రతినిధులు, అధికారు లు, శ్రేయోభిలాషులు మరియు వివిధ మాధ్యమాలు, సందేశాల ద్వారా శుభా కాంక్షలు, అభినందనలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదా లు తెలియజేశారు.అందరి సూచనలు మరియు సలహాలు,సహకారంతో మండలమును అభివృద్ధి పథంలో నడిపించేందుకు తన శాయ శక్తుల కృషి చేస్తానని అదే విధంగా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని పేర్కొన్నా రు.తనపై ఎంతో నమ్మకంతో ఈబాధ్య తను అప్పగించిన అధిష్టానానికి, అండ గా నిలిచిన నాయకులు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు.బాధ్యతల స్వీకరణ కార్యక్ర మాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన స్థానిక ప్రజాప్రతి నిధులు, పార్టీ శ్రేణులు, అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అందరి సహకారంతో మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు,ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటు లో ఉంటానని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధికారులతో పాటు సీతానగరం ఎంపీటీసీ సబ్బాన శీను. మాజీ సర్పంచ్ బుడితి శీను. టిడిపి పార్టీ నాయకులు డీ భాను ప్రసాద్ చౌదరి(పెద్దబ్బాయి)సాలా హరిబాబు తో పాటు పలువురు టిడిపి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.