దర్శిలో పలు పంచాయతీలలోఏకగ్రీవం కానున్న కూటమి సర్పంచ్అ భ్యర్థులు.
సూర్య న్యూస్ దర్శి:
ఏకగ్రీవం దిశ లో పలు గ్రామ పంచాయతీలు.
దర్శి లోని పలు పంచాయతీలో ఏకగ్రీవం కానున్న కూటమి అభ్యర్థులు.
దర్శి మండలంలోని పలు పంచాయతీలు ఏకగ్రీవం కానున్నాయి. మండలంలో మొత్తం 25 గ్రామపంచాయతీలు ఉండగా అందులో పలు పంచాయితీలు ఏకగ్రీవం కానున్నాయి. శుక్రవారంతో నామినేషన్ ఘట్టం ముగిసింది. శనివారం స్క్రూ టిని నీ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. పలు పంచాయతీలలో కూటమి మద్దతుదారులు ఏకగ్రీవం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మండలంలోని వెంకటాపురం ,బండి వెలిగండ్ల ,బొట్లపాలెం, పథకమూరు ,వెంకటచలం పల్లి ,పోతవరం, దేవవరం , జముకుల దిన్నె గ్రామపంచాయతీలు ఏకగ్రీవం కానున్నాయి. ఆయా గ్రామపంచాయతీలలో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవం కానున్నారు. మరి కొన్ని గ్రామపంచాయతీలు కూడా ఏకగ్రీవము అయ్యే అవకాశం ఉంది.