BREAKING
దర్శిలో పలు పంచాయతీలలోఏకగ్రీవం కానున్న కూటమి సర్పంచ్అ భ్యర్థులు. వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థిగా బొమ్మన రామకాంత్ రెడ్డి నామినేషన్ మీ ఆదరణ మరువలేనిది.. కుసుమూరులో ధాన్యం కొనుగోలు కేంద్రo ప్రారంభం నల్లమాడ పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా ...నల్లమాడ సర్పంచ్ అభ్యర్థి టిడి రఘునాథరెడ్డి అవినీతిపై ఫిర్యాదు చేయండి... ఏసీబీ కి సమాచారం అందించండి. రహదారిపై వడ్ల కుప్ప.. అదుపుతప్పిన బైక్ చెకుముకి మండల స్థాయి టాలెంట్ టెస్టులో ప్రథమ స్థానంలో నిలిచిన జడ్పిహెచ్ఎస్ కోహెడ్ విద్యార్థులు చెకుముకి మండల స్థాయి టాలెంట్ టెస్టులో ప్రథమ స్థానంలో నిలిచిన జడ్పిహెచ్ఎస్ కోహెడ్ విద్యార్థులు విద్యార్థులకు పోక్సో చట్టంపై న్యాయ విజ్ఞాన సదస్సు మందకొడిగా పల్లె పోరు నామినేషన్లు తొలి రోజు 8 సర్పంచ్, 26 వార్డు సభ్యుల నామినేషన్లు బాడంగిలో సర్పంచ్ స్థానాలకు హోరాహోరీ పోటీ ఐదు పంచాయతీల్లో ఏకగ్రీవం.. 20 పంచాయతీల్లో ఎన్నికలు జిఎంసి ఎల్ఆర్ఎస్ మేళాకి 280 దరఖాస్తులు మేయర్, కౌన్సిల్ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు సిద్దం: నగర కమిషనర్ వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థిగా ఎల్.ఇ. పుష్పవతి నామినేషన్

వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థిగా బొమ్మన రామకాంత్ రెడ్డి నామినేషన్

Select Suryaa Now
వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థిగా బొమ్మన రామకాంత్ రెడ్డి నామినేషన్

వెల్దుర్తి,  రూలర్ న్యూస్: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వెల్దుర్తి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పదవికి బొమ్మన రామకాంత్ రెడ్డి శనివారం తన నామినేషన్‌ను దాఖలు చేశారు.  గ్రామ సచివాలయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఆయన తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. అంతకుముందు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు కుటుంబ సభ్యులతో కలిసి ఆయన అట్టహాసంగా కార్యాలయానికి చేరుకున్నారు. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేసిన అనంతరం ఎన్నికల నియమావళికి అనుగుణంగా సంబంధిత ధ్రువీకరణ పత్రాలను పూర్తి చేశారు.  ఈ సందర్భంగా బొమ్మన రామకాంత్ రెడ్డి మాట్లాడుతూ, వెల్దుర్తి మేజర్ గ్రామపంచాయతీ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా తాను ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు తెలిపారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. ప్రజలందరూ తనను ఆశీర్వదించి, భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ నామినేషన్ కార్యక్రమంలో పలువురు స్థానిక ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు.