కుసుమూరులో ధాన్యం కొనుగోలు కేంద్రo ప్రారంభం
తె ర్లాం సూర్య: ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ లో రైతులకు ప్రభుత్వం మద్దతుర ప్రకటిస్తూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు కసరత్తు ప్రారంభించారు.s శనివారం కుసుమూరు గ్రామంలో రైతు భరోసా కేంద్రంలో తాసిల్దార్ ఆర్ ధనం మండల వ్యవసాయ అధికారి బొత్స శ్రీనివాసరావు సివిల్ సప్లైస్ డిటి అల్లు స్వర్ణలత లాంచన ప్రాయంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ ఆర్ ధనం మాట్లాడుతూ ఈ ఏడాది ప్రభుత్వం రైతులకు మంచి గిట్టుబాటు ధరను ప్రకటించిందని ఆ మద్దతు ధరను రైతుల సద్విని చేసుకోవాలన్నారు. వరి సాధారణ రకం తమకు గిట్టుబాటు ధర రూ. 2441 లు కాగా ఏ గ్రేడు అయితే 24 61 మద్దతుధర ప్రభుత్వం ప్రకటించిన నందున రైతులకు ఈ ఏడాది మంచి గిట్టుబాటు ధర అని చెప్పక తప్పదు అన్నారు. అందుకు ప్రతి రైతు నాణ్యమైన పంటను తయారు చేసుకొని ప్రైవేట్ కేంద్రాలకు వెళ్లకుండా దళారులు మోసానికి గురికాకుండా తమ ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తరలించి మంచి ఆర్థిక లాభాన్ని పొందాలని ఆమె సూచించారు అదేవిధంగా మండల వ్యవసాయ అధికారి కొత్త శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ ఏడాది మండలంలో వరి దిగుబడి బాగానే ఉంటుందని రైతుకు లాభదాయంగానే ఉంటుందని ఆయన తమ ఆశాభావం వ్యక్తం చేశారు .అదేవిధంగా సివిల్ సప్లై డిటి హాల్లో స్వర్ణలత పలు సూచనలు సలహాలు ఇచ్చారు కార్యక్రమంలో వీఆర్వో వ్యవసాయ సహాయకులు గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.