బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి కమలాకర్ రెడ్డి
సిద్దిపేట రూరల్, :రూరల్ మండలం పెద్దలింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు, బూత్ ఇన్‌చార్జి కొమ్మిడి కమలాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.ఈ సందర్భంగా కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజాపాలనకు ఆకర్షితుడై కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్, చిన్నకోడూరు మార్కెట్ కమిటీ చైర్మన్ మీసం మహేందర్, నంగునూరు మార్కెట్ కమిటీ చైర్మన్ దేవులపల్లి యాదగిరి, ఆర్టీఏ సభ్యుడు డాక్టర్ సూర్యవర్మ, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ కోదాది, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.