సేవా దృక్పథం చాటుకున్న ఎస్ఎఫ్ఐ నాయకులు.. రాప్తాడు ఘటన బాధితురాలి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సహాయం
అనంతపురం విద్య, మేజర్ న్యూస్ :-రాప్తాడు ఘటనలో తీవ్రంగా గాయపడి బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని గోపికను ఎస్ఎఫ్ఐ అనంతపురం జిల్లా నాయకులు శనివారం పరామర్శించారు. ఆమె కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి నాగేంద్ర కుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఓతూరు పరమేష్, జిల్లా అధ్యక్షుడు తరిమెల గిరి మాట్లాడుతూ.. గోపికపై జరిగిన దాడి అత్యంత దారుణమని, ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధిత కుటుంబానికి స్వచ్ఛంద సంస్థలు, దాతలు తమ వంతు సహాయం అందించాలని కోరారు. గంజాయి, మాదకద్రవ్యాల వినియోగం పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, వాటిని అరికట్టడంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో భద్రతా సిబ్బందిని నియమించి, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు బంగి శివ, జిల్లా నాయకులు రషీద్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్..