లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ విధులు పై రివ్యూ మీటింగ్:"
కర్నూలు, Dt.21-11-2026.
న్యాయ విభాగము:
శ్రీ పి. వాసు,జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు చైర్మన్,జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, కర్నూలు మరియు బి. లీలా వెంకట శేషాద్రి, సెక్రటరీ-కం-సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కర్నూలు వారు కర్నూలు కోర్టు కాంపౌండ్ లో గల లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఆఫీస్ నందు "లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ విధులు పై రివ్యూ మీటింగ్" నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా జిల్లా జడ్జి "లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ విధులు, చట్టపరమైన సలహాలు, జైలు విజిట్లు, కేసుల వివరాలు మరియు పరిష్కారము మొదలగు అంశాలపై సూచనలు చేశారు.అలాగే పెండింగ్ లో గల కేసులలో ఎన్ని కేసులలో బెయిల్స్ మంజూరు చేశారో వాటి కేసుల యొక్క స్థితిగతులను తెలుసుకొని వాటిని ఏ విధంగా త్యరిత గతిన పరిష్కరించాలో అనే దానిపై సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శివరామ చంద్ర రావు , అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ ఏ. సులోచన,సిబ్బంది పాల్గొన్నారు.