ఎంపీపీ పువ్వాడికి ఘన సత్కారం
పామూరు, మేజర్ న్యూస్ : పామూరు మండల ఎంపీపీగా బాధ్యతలు స్వీకరించిన పువ్వాడి వెంకటేశ్వర్లును కంబాలదిన్నె గ్రామానికి చెందిన టిడిపి నేతలు సత్కరించారు. శనివారం సాయంత్రం పట్టణంలోని శేషమహాల్ థియేటర్ ప్రాంగణంలో గ్రామ ఉపసర్పంచ్ ఏలూరి మాధవరావు (కోటయ్య), ఏలూరి నరసింహారావు, ఏలూరి చౌదరి బాబు ఎంపీపీ పువ్వాడి వెంకటేశ్వర్లు కు శాలువా కప్పి సత్కరించి జ్ఞాపికగా బంగారు రంగు పెన్నును అందజేశారు. ఈ సందర్భంగా నూతన బాధ్యతలు చేపట్టిన పువ్వాడి వెంకటేశ్వర్లుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడుసుమల్లి ప్రభాకర్ చౌదరి, టీడీపీ క్లస్టర్ ఇన్‌చార్జి గుంటుపల్లి శ్రీనివాసులు పాల్గొన్నారు.