BREAKING
పంటపాలెం పారిశ్రామిక ప్రాంతంలో 132 కేవీ సబ్‌స్టేషన్ ఏర్పాటుకు ప్రతిపాదన చేయాలని ఎస్‌ఈని కోరిన పారిశ్రామిక వినియోగదారులు బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి కమలాకర్ రెడ్డి ఎన్నికల అధికారులకు శిక్షణ..! జన సందోహం మధ్య... సర్పంచ్ అభ్యర్థిగా ఆలపాక నామినేషన్ సౌత్ మోపూర్ సర్పంచ్ బరిలో బండి అంకమ్మ ఆత్మకూరు మండలంలో ఏకగ్రీవం కానున్న పలు పంచాయతీలు విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి ప్రజారోగ్యమే ప్రథమ ప్రాధాన్యత.. మంచినీటి ట్యాంక్ డీప్ క్లీనింగ్‌కు కార్పొరేటర్ విజయలక్ష్మి చర్యలు! ఆత్మీయ పలకరింపులతో ముగిసిన చివరి కౌన్సిల్ సమావేశం సర్పంచ్ అభ్యర్థిగా పొట్నూరు వాణి సాయి ప్రసాద్ నామినేషన్ అమ్మ చేతి వంటతో ఆరోగ్యం.. బయటి ఆహారంతో అనారోగ్యం బయటి ఆహారానికి నో చెబుదాం.. ఇంటి భోజనంతో ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.. ఎన్నికల సిబ్బందికి శిక్షణా తరగతులు పాత వెల్లంటిలో సీపీఎం సర్పంచ్ అభ్యర్థిగా పల్లవరపు చెంచయ్య నామినేషన్ వినబడని ప్రజల దాహం కేకలు...! స్పెషల్ లోక్ అదాలత్"

ఆంగ్ల భాషా నైపుణ్యం పై విద్యార్థులకు ప్రతిభా పోటీలు..

Select Suryaa Now
ఆంగ్ల భాషా నైపుణ్యం పై విద్యార్థులకు ప్రతిభా పోటీలు..

దుబ్బాక ; ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ (ఎల్టా) ఆధ్వర్యంలో శనివారం దుబ్బాక మున్సిపల్ పరిధిలో దుంపలపల్లి ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రతిభా పోటీలు నిర్వహించారు. ఆంగ్ల భాషపై పట్టు సాధించడం, భయం లేకుండా మాట్లాడటం తదితర అంశాలపై విద్యార్థులను నిపుణులుగా తీర్చిదిద్దే ఉద్దేశ్యంతో "ఎల్టా" ప్రతి సంవత్సరం విద్యార్థులకు ప్రతిభా పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎల్టా కన్వీనర్ ఎండీ ముజీబ్ అలీ, కో- కన్వీనర్ సింగీతం నరసింహారావు తెలిపారు. అందులో భాగంగా ఈ ఏడాది దుంపలపల్లి ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ ఒలంపియాడ్ టాలెంట్ టెస్ట్, ఉపన్యాస పోటీలు నిర్వహించామన్నారు. ఈ పోటీల్లో ఒలంపియాడ్ సీనియర్ విభాగంలో
దుబ్బాక పీ ఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని బి. లక్ష్మీ ప్రసన్న ప్రథమ స్థానం,  లచ్చపేట జడ్పీ హైస్కూల్  విద్యార్థిని టి. కీర్తన ద్వితీయ స్థానం పొందారు. జూనియర్ విభాగంలో దుబ్బాక ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి  ఎండీ మూస ప్రథమ స్థానం, లచ్చపేట మాడల్ స్కూల్ విద్యార్థి ఎం. సాయి చరణ్ ద్వితీయ స్థానం పొందారు. అదే విధంగా ఉపన్యాస పోటీలో సీనియర్ విభాగంలో లచ్చపేట మాడల్ స్కూల్ విద్యార్థిని జి. భవ్య ప్రథమ స్థానం, పెద్దగుండవెల్లి జడ్పీ  హైస్కూల్ విద్యార్థి అచ్యుత్ కుమార్ ద్వితీయ స్థానం పొందారు. జూనియర్ విభాగంలో లచ్చపేట మాడల్ స్కూల్ విద్యార్థిని ఇందిర సృజిత ప్రథమ స్థానం, పెద్దగుండవెల్లి జడ్పీ  హైస్కూల్ విద్యార్థిని డి. అంజలి ద్వితీయ స్థానం పొందారు.
వీరందరికీ దుబ్బాక ఎంఈవో జే ప్రభుదాస్, దుబ్బాక పీఎం శ్రీ బాలికోన్నత పాఠశాల హెడ్మాస్టర్ పట్నం భూపాల్ విజేతలకు సర్టిఫికెట్లు అందజేశారు.
ఆంగ్ల భాషా నైపుణ్యం పెంపొందించేందుకు "ఎల్టా" చేస్తున్న  కృషిని వారు కొనియాడారు