స్పెషల్ లోక్ అదాలత్"
కర్నూలు, dt.21-11-2026.
" స్పెషల్ లోక్ అదాలత్" రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థల ఆదేశాల మేరకు శ్రీ పి. వాసు, ఆరవ అదనపు జిల్లా జడ్జి, ఫుల్ అడిషనల్ ప్రధాన న్యాయమూర్తి మరియు చైర్మన్,జిల్లా న్యాయ సేవాది కార సంస్థ గారి ఆధ్వర్యంలో శనివారం 21-11-2026 న జరిగిన స్పెషల్ లోక్ అదాలత్ లో ఉమ్మడి కర్నూలు నంద్యాల జిల్లాలలో 51 చెక్ బౌన్స్ కేసులు పరిష్కారం అయ్యాయి. మొత్తం రెండు జిల్లాల్లో 16 బెంచీలను ఏర్పాటు చేసి 51 చెక్ బౌన్స్ కేసులు పరిష్కరించి Rs. 2,30,00,000/- రూపాయలు కక్షి దారులకు అందించారు. ఈ స్పెషల్ లోక్ అదాలత్ లో కర్నూలు లో జిల్లా కోర్ట్ ల కు చెందిన చెక్ బౌన్స్ కేసులను ఏడవ
అదనపు జిల్లా జడ్జి లక్ష్మీరాజ్యం గారు, మేజిస్ట్రేట్ కోర్ట్ లకు చెందిన చెక్ బౌన్స్ కేసులను ఎక్సైజ్ కోర్టు మెజిస్ట్రేట్ అనిల్ కుమార్ గారు పరిష్కరించారు.ఈ కార్యక్రమంలో బెంచ్ మెంబర్స్ బద్దల్ లక్ష్మీనారాయణ, రామ పుల్లయ్య పాల్గొన్నారు.