బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఆంజనేయులు
పుల్కల్ : ఆందోల్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా పుల్కల్ గ్రామానికి చెందిన లస్కరి ఆంజనేయులు ముదిరాజ్ నియమితులయ్యారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య చేతుల మీదుగా ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు. ఆందోల్ ప్రాంతంలో బీసీ వర్గాల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారానికి కృషి చేసే బాధ్యత ఆయనపై అప్పగించారు. ఈ నియామకంతో పుల్కల్ గ్రామానికి చెందిన ఆంజనేయులు బీసీ సంఘం బాధ్యతలు చేపట్టనున్నారు.