BREAKING
ఎన్ని పొర్లు దండాలు పెట్టిన, కుప్పిగెంతులు వేసిన అధికారంలోకి రావడం జగన్మోహన్ రెడ్డికి పగటి కలే ఎమ్మెల్సీ వర్ల రామయ్య ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండండి... ప్రతి ఓటర్ ను కలవండి. ఎమ్మెల్యే శాస్త్రృక్తంగా తులసీ దామోదర, గో వృషభ కళ్యాణాలు చరిత్రలో నిలిచిపోయేలా నితిన్ నబీన్ ‘మహా పాదయాత్ర’’కు ఏర్పాట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ పెంచలకోనలో వైభవంగా చిలుక ద్వాదశి ఉత్సవాలు తల్పగిరి రంగనాధ స్వామి ఆలయంలో వైభవంగా చిలుక ద్వాదశి వేడుక సోమవారం జీఎంసీ 'పీజీఆర్ఎస్' రద్దు: కమిషనర్ కె. మయూర్ అశోక్ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు మంచం.. కత్తెర .. ఉంగరం.. బుట్ట.. వంకాయ! నలుగురు నిందితుల అరెస్ట్… కారంచేడు అరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వీడి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయండి వందవాగలి గ్రామ సర్పంచ్ గా సత్యనారాయణ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక నేటి నుండి ​ఐదు జిల్లాల పాత కేసుల విచారణ ​క్యాంప్ కోర్టు నోడల్ అధికారి బొగ్గరం తారక నరసింహ కుమార్ వెల్లడి పామూరు అభివృద్ధికి ఒక్క అవకాశం ఇవ్వండి

పెంచలకోనలో వైభవంగా చిలుక ద్వాదశి ఉత్సవాలు

Select Suryaa Now
పెంచలకోనలో వైభవంగా చిలుక ద్వాదశి ఉత్సవాలు

రాపూరు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో శనివారం చిలుక ద్వాదశి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉదయం  శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయంలో అష్టోత్తర శత కలశాభిషేకం, సాలగ్రామ ధాత్రి పూజలు, హోమం శాస్త్రోక్తంగా జరిగాయి. మధ్యాహ్నం  నిర్వహించిన వన భోజన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీవారి ప్రసాదాలను స్వీకరించారు.

సాయంత్రం శ్రీ చెంచులక్ష్మి ఆదిలక్ష్మి సమేత శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామికి బంగారు గరుడ సేవ కన్నులపండువగా సాగింది. ఆస్థానం అనంతరం భక్తులు సమర్పించిన 100 గొడుగులతో క్షేత్రోత్సవాన్ని ప్రధానార్చకులు, వేదపండితుల మంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాలు, గోవింద నామ స్మరణల మధ్య భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం ఉప కమిషనర్, కార్యనిర్వహణాధికారి కోవూరు జనార్దన రెడ్డి ప్రత్యక్ష పర్యవేక్షణలో క్యూలైన్ల ఏర్పాట్లు, త్రాగునీటి సరఫరా, అన్నదానం తదితర సౌకర్యాలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించారు. చిలుక ద్వాదశి సందర్భంగా శనివారం దేవస్థానానికి భక్తుల ద్వారా మొత్తం రూ. 4,54,825/- ఆదాయం సమకూరిందని అధికారులు వెల్లడించారు. ఈ మొత్తం ఆదాయాన్ని పెంచలకోనలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో జమ చేసినట్లు దేవస్థానం ఉప కమిషనర్ కోవూరు జనార్దన రెడ్డి పేర్కొన్నారు.