సోమవారం జీఎంసీ 'పీజీఆర్ఎస్' రద్దు: కమిషనర్ కె. మయూర్ అశోక్
గుంటూరు: గుంటూరు నగరపాలక సంస్థ (జీఎంసీ) కార్యాలయంలో సోమవారం జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.సోమవారం నాడు నగరపాలక సంస్థ నూతన మేయర్ మరియు కౌన్సిల్ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. నగర ప్రజలు ఈ మార్పును గమనించి సోమవారం నాడు అర్జీల కోసం కార్యాలయానికి రావద్దని కోరారు. అత్యవసర లేదా స్థానిక సమస్యలు ఏవైనా ఉంటే ప్రజలు నేరుగా జీఎంసీ కాల్ సెంటర్ నంబర్ 0863-2345103 కు ఫోన్ చేసి తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చని కమిషనర్ సూచించారు.
సూర్య నాయక్