BREAKING
పంటపాలెం పారిశ్రామిక ప్రాంతంలో 132 కేవీ సబ్‌స్టేషన్ ఏర్పాటుకు ప్రతిపాదన చేయాలని ఎస్‌ఈని కోరిన పారిశ్రామిక వినియోగదారులు బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి కమలాకర్ రెడ్డి ఎన్నికల అధికారులకు శిక్షణ..! జన సందోహం మధ్య... సర్పంచ్ అభ్యర్థిగా ఆలపాక నామినేషన్ సౌత్ మోపూర్ సర్పంచ్ బరిలో బండి అంకమ్మ ఆత్మకూరు మండలంలో ఏకగ్రీవం కానున్న పలు పంచాయతీలు విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి ప్రజారోగ్యమే ప్రథమ ప్రాధాన్యత.. మంచినీటి ట్యాంక్ డీప్ క్లీనింగ్‌కు కార్పొరేటర్ విజయలక్ష్మి చర్యలు! ఆత్మీయ పలకరింపులతో ముగిసిన చివరి కౌన్సిల్ సమావేశం సర్పంచ్ అభ్యర్థిగా పొట్నూరు వాణి సాయి ప్రసాద్ నామినేషన్ అమ్మ చేతి వంటతో ఆరోగ్యం.. బయటి ఆహారంతో అనారోగ్యం బయటి ఆహారానికి నో చెబుదాం.. ఇంటి భోజనంతో ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.. ఎన్నికల సిబ్బందికి శిక్షణా తరగతులు పాత వెల్లంటిలో సీపీఎం సర్పంచ్ అభ్యర్థిగా పల్లవరపు చెంచయ్య నామినేషన్ వినబడని ప్రజల దాహం కేకలు...! స్పెషల్ లోక్ అదాలత్"

సైదాపురం సర్పంచ్ అభ్యర్థిగా బోల్లిగర్ల అర్చన నామినేషన్ దాఖలు

Select Suryaa Now
సైదాపురం సర్పంచ్ అభ్యర్థిగా బోల్లిగర్ల అర్చన నామినేషన్ దాఖలు

సైదాపురం, మేజర్ న్యూస్ : సైదాపురం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ సర్పంచ్ పదవికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బోల్లిగర్ల అర్చన శనివారం నామినేషన్ దాఖలు చేశారు. గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో రిటర్నింగ్ అధికారి షేక్ రియాజ్‌కు తన నామినేషన్ పత్రాలను అందజేశారు.  ఈ సందర్భంగా బోల్లిగర్ల అర్చన మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి సర్పంచ్ అభ్యర్థిగా ఎంపిక చేసిన సైదాపురం మండల వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు మన్నారపు రవికుమార్ యాదవ్‌కు, గ్రామ పెద్దలకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజల మద్దతుతో విజయం సాధించేందుకు కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు. మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శనివారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కావడంతో సైదాపురం గ్రామంలో ఎన్నికల సందడి మొదలైంది. సర్పంచ్ పదవితో పాటు వార్డు సభ్యుల స్థానాలకు కూడా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. సైదాపురం గ్రామపంచాయతీలో మొత్తం 14 వార్డు సభ్యుల స్థానాలు ఉండగా, 10వ వార్డు సభ్యుడిగా చిలకల వెంకటేశ్వర్లు  శనివారం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని అభ్యర్థులకు మద్దతు తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో సైదాపురం గ్రామంలో పంచాయతీ ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది.