మదనపల్లిలో కూటమి సర్పంచ్ అభ్యర్థుల జాబితా విడుదల : కూటమి అభ్యర్థులు గెలుపు కోసం సమిష్టిగా పనిచేయాలి : మదనపల్లి ఎమ్మెల్యే షాజహన్ బాషా ఆదేశం
మదనపల్లె,మేజర్ న్యూస్ : మదనపల్లె నియోజకవర్గంలో 53 గ్రామ పంచాయతీలకు కూటమి సర్పంచ్ అభ్యర్థుల జాబితాను ఎమ్మెల్యే షాజహాన్ బాషా విడుదల చేశారు.శనివారం పట్టణంలోని ఎమ్మెల్యే షాజహాన్ బాషా నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని 53 గ్రామ పంచాయతీల్లో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని పిలుపు నిచ్చారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు,చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి,గ్రామాల అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులకు మద్ధతు కోరాలని అభ్యర్థులకు సూచించారు.అలాగే అనివార్య కారణాల వల్ల సర్పంచ్ అభ్యర్థిత్వం దక్కని నాయకులు,కార్యకర్తలు నిరుత్సాహపడకుండా పార్టీ నిర్ణయాన్ని గౌరవించి,పార్టీ అధిష్టానం ప్రకటించిన అభ్యర్థుల విజయానికి సహకరించాలని కోరారు.పార్టీ నిర్ణయమే శిరోధార్యమని,ఐక్యతతో ముందుకు సాగుదామని స్పష్టం చేశారు.
మదనపల్లె మండల సర్పంచ్ అభ్యర్థుల వివరాలు
బసినికొండ పంచాయతీలో విజ్జి,బొమ్మనచెరువుకు కదిరిపతి,చీకలబైలుకు రెడ్డెప్ప,సిటిఎంకు పార్వతమ్మ,సిటిఎం క్రాస్ రోడ్డులో బిజెపి,అదేవిధంగా దుబ్బిగానిపల్లి కృష్ణమూర్తి,ఈశ్వరమ్మ కాలనీ ఇస్మాయిల్,కోళ్ళబైలు ఈశ్వర్ నాయుడు,కొండమార్రిపల్లి జయరాం యాదవ్,కోటావారిపల్లి సొక్కం రమేష్,కొత్తఇండ్లు దొరస్వామి నాయుడు,కొత్తపల్లిలో స్థానిక నాయకులు అభ్యర్థిని పెడుతున్నారని,కొత్తవారి పల్లె పెండింగ్ ఉందని,కురవంక శ్రీవిద్య,నారమాకుల తాండా రవి నాయక్,పొన్నూటిపాళ్యం జెఎస్పీకి ఇవ్వడం జరిగిందని,పోతబోలు సుధాకర్,రామాచార్ల పల్లి జనసేన పార్టీకి,తట్టివారిపల్లి రుక్సాన,వలసపల్లి ఈశ్వరయ్య,వేంపల్లి భారతీ,వైఎస్ఆర్ కాలనీ సి.జయరాంలు సర్పంచ్ అభ్యర్థులుగా బరిలో ఉన్నారని ప్రకటించారు.ఇందులో భాగంగా మొత్తంలో జనసేనపార్టీకి మూడు,బిజెపికి ఒకటి సీటు ఇచ్చామన్నారు.ఈ సమావేశంలో మదనపల్లె ఎంపిపి బీదం గురునాథ్ యాదవ్,నవీన్ కుమార్ చౌదరి,బెల్లే రెడ్డి ప్రసాద్,వసంత కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి