సమర్ధవంతమైన నాయకులను గెలిపించాలి: మజ్జి సిరి సహస్ర
చీపురుపల్లి మేజర్ న్యూస్: గ్రామస్థాయిలో సమర్ధవంతమైన నాయకులను సర్పంచ్ లుగా గెలిపించాలని జెడ్పీ చైర్ పర్సన్ మజ్జి సిరి సహస్ర పిలుపునిచ్చారు.
మండలంలోని పెదనడిపల్లి, చిన నడిపల్లి గ్రామ పంచాయతీల సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మజ్జి సిరి సహస్ర ఆదివారం పాల్గొన్నారు. అనంతరం సర్పంచ్ అభ్యర్థి విజయలక్ష్మితో కలిసి ఆమె వార్డ్ అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా నామినేషన్ కేంద్రానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సిరి సహస్ర మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి సమర్థవంతమైన నాయకత్వం, ప్రజల సమస్యలపై నిరంతరం స్పందించే నాయకులు, అవసరమని ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేసే అభ్యర్థులను గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఎంపీటీసీలు, వార్డ్ మెంబర్ అభ్యర్థులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
రిపోర్టర్ మధు, చీపురుపల్లి, విజయనగరం జిల్లా