ఒంగోలు ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఒంగోలు మండలంలోని ఆరు గ్రామాల సర్పంచులు
ఒంగోలు, మేజర్‌న్యూస్ :
ఒంగోలు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఒంగోలు మండలం లోని ఏకగ్రీవాలు ఐనా ఆరు గ్రామాల సర్పంచులు, తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించే అంశాలపై నాయకులు చర్చించారు. గ్రామాల అభివృద్ధికి సమిష్టి కృషి చేయాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేయాలని జనార్దన్ గారు తెలిపారు.
సర్పంచుల వివరాలు:
1. బొద్దులూరివారిపాలెం: చప్పిడి శేషయ్య.
2. దేవరంపాడు: ముప్పావరపు రాధ.
3. దేవరంపాడు హరిజనవాడ: కనుమూరి సుధీర్.
4. గుండాయిపాలెం: సింగూతు కృష్ణవేణి.
5. ఉలిచి: పిలుట్ల మాధవి.
6. వలేటివారిపాలెం: కరవడి చంద్రశేఖర్.
ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ కొక్కిలగడ్డ ప్రభాకర్ రావు, మార్కాపురం జిల్లా పరిషత్ చైర్మన్ కందుల రామిరెడ్డి, క్లస్టర్ కన్వీనర్ నల్లమోతు గంగాధర్, పీఏసీఎస్ చైర్మన్ ముప్పావరపు వెంకటేశ్వరరావు, పాతూరి పూర్ణ తదితరులు పాల్గొన్నారు.