తెల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు చిలకమర్రి ప్రభాకర్ రెడ్డి.
రామచంద్రాపురం;చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు చిలకమర్రి ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆయన చిన్నారులకు పోలియో చుక్కలు వేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. పోలియో మహమ్మారిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు రెండు చుక్కల పోలియో మందు వేయించి వారి ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు బాటలు వేయాలని పిలుపునిచ్చారు.